క్రిష్ణా జిల్లాలో ఆ మూడు తప్ప మిగతావన్నీ ఫిక్స్ ! ఇంతకీ గుడివాడ సంగతేంటి ?

ఎవరి హడావుడిలో వాళ్లు ఉన్నారు. చేరే వాళ్లు చేరుతున్నారు. జారే వాళ్లు జారుతున్నారు. చంద్రబాబు మాత్రం కాన్ఫిడెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నాడు. గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి ? ఎవరి బలాబలాలు ఏంటో లెక్క తీసి మరీ లెక్కలు తేలుస్తున్నాడు. క్రిష్ణా జిల్లాలో ఆ మూడు చోట్ల తప్ప అన్నీ ఓకే అయిపోయాయ్ అంటున్నారు. ఇంతకీ ఏమిటా మూడు ?

క్రిష్ఱా జిల్లాలో 16 సీట్లు ఉన్నాయ్. ఏపీకి ఆయువు పట్టు. పదో వంతు ఇక్కడే ఉంది దాదాపుగా ! ఇలాంటి చోట్ల రేసు గుర్రాలను ఖరారు చేసేశాడు దాదాపుగా ! ఓ మూడు స్థానాలు మాత్రం మినహాయింపు. పెడన నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనారోగ్యంతో ఉన్నాడు. తిరగలేక పోతున్నాడు. గతంలో ఓసారి హాస్పిటల్ లో అడ్మిట్ కూడా అయ్యాడు. అక్కడ అభ్యర్థి మారతాడు. కొడుకుల్లో ఒకరికి ఇస్తాను, ఎవరు దిగుతారో చెప్పండి అని వెంకట్రావుకి చంద్రబాబు చెప్పేశాడు. ఇద్దరూ కుర్రాళ్లే. మరి అంత చిన్నవాళ్లు అయితే కాదు. కాకపోతే పార్టీకి పట్టు ఉంది. బీసీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న నియోజక వర్గం కాబట్టి పెద్దగా ఢోకా ఉండదు. అందుకే కాగిత కుటుంబం ఖాయం. ఇక గుడివాడ. ఇది హై ఓల్టేజ్ సీటు. గత ఎన్నికల్లో అయితే చూసీ చూడనట్టు వెళ్లిపోయాడు. ఈసారి చంద్రబాబు సీరియస్ గా తీసుకుంటాడు అంటున్నారు. అందుకే నిర్ణయం మరి కొద్ది రోజుల పాటు సస్పెన్స్ అంటున్నారు.దేవినేని అవినాశ్ దిగుతాడు అనుకున్నారు కానీ ఆగుతున్నారు ఎందుకనో ! త్వరలో ప్రకటిస్తాడు. ఇక మూడో సీటు కూడా ఆ పక్కనే ఉంది. ఉప్పులేటి ఉన్న చోట అభ్యర్థి మారే అవకాశం కనిపిస్తోంది.ఎందుకంటే ఆమె భర్తకు ఆల్రెడీ ఒప్పందంలో భాగంగా అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఆమె మారడం దాదాపుగా ఖాయం.

అంటే ఆ మూడు మినహా మిగతావన్నీ ఫిక్స్. ఇక పనులు చేసుకోండి అని చెప్పడమే కాదు ఎవరిని కలవాలో కూడా చెప్పేశాడు చంద్రబాబు అంటున్నారు. అంటే పక్కా వ్యూహంతో రెడీ అయిపోయింది వ్యవహారం. అందుకే చంద్రబాబు పనులు మాత్రం నడుస్తున్నాయ్.ఇక నెలాఖరు నుంచి బాబు బ్యాటింగ్ మొదలవుతుంది అంటున్నారు. మరి ఆ కొట్టుడు ఎలా ఉంటుందో చూడాలి !

-->