20 రోజుల నాడు కేసీఆర్ కి 80 సీట్లు వస్తాయన్నాడు… ఇప్పుడు ఏం రాశాడో చూడండి !

కేసీఆర్ కి 80 సీట్లు వస్తాయని ఆయన రాసినప్పుడు దేవాదుల పైపులైను పగిలి నీరు ఎగజిమ్మినంత నిరసన తన్నింది ! ఏమిచ్చాడు – ఎంతిచ్చాడు – అంటూ ఎవరిష్టమొచ్చినట్టు వాళ్లు తిట్టిపోశారు ! ఇప్పుడు సినిమా మారిందని ఆయన రాస్తున్నాడు. పైగా టీఆర్ఎస్ కి ఎన్ని సీట్లు వస్తాయన్నాడో చూడండి !

అస్సలు కేసీఆర్ కి తిరుగులేదు అన్నాడు. అనుకోనిది ఏమైనా జరిగితే టీఆర్ఎస్ కి 80 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి తప్పితే తగ్గవ్ అన్నాడు. అహో ఓహో అద్భుతం అన్నాడు. కేసీఆర్ తిట్టే తిట్లు కూడా గంధం రాచినట్టు ఉంటాయ్ అన్నాడు. కోపం రాదన్నాడు. ఇప్పుడు అదే మనిషికి తత్వం బోధపడింది. గ్రౌండ్ లో రియాలిటీ ఏంటో తెలిసినట్టు ఉంది. జనం వాయిస్ వినబడుతున్నట్టుగా ఉంది. అందుకే టోన్ పూర్తిగా మారిపోయింది. జనంలో పెను వ్యతిరేకత ఉందని రాశాడు. పైగా కేసీఆర్ ధోరణి, చంద్రబాబును తిడుతున్న తిట్లపై తెలంగాణ భగ్గుమంటోంది అనేశాడు. సెటిలర్లే కాదు తెలంగాణ వాళ్లు కూడా చంద్రబాబును తిట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అన్నాడు. జ్ఞానచూర్ణం ఏమైనా తీసుకున్నాడో లేదంటే సర్వే రిపోర్టుల్లో వాస్తవాలు తెలిసి వచ్చాయో తెలీదు కానీ ఇప్పుడు అయితే వాస్తవం దగ్గరకి వచ్చినట్టుగా ఉన్నాడు. మొన్నటి వరకూ వార్ వన్ సైడుగా ఉందట తెలంగాణలో. టీడీపీ టీఆర్ఎస్ కలిసి ఉన్నట్టైతే అలాగే ఉండేదట కూడా ! కానీ కాంగ్రెస్ టీడీపీ కలిసిన తర్వాత, ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు రాజకీయ పక్షాలను ఏకం చేయడం మొదలు పెట్టిన తర్వాత అసలు లెక్కలే మారిపోయాయట. ఇప్పుడు ఆ ప్రభావం తెలంగాణపైనా పడటం ఖాయం అయ్యిందట. ఇప్పటికైతే తెలంగాణలో బలాబలాలు పోటాపోటీగా ఉన్నాయట. అంటే కేసీఆర్ వర్సెస్ కూటమి అన్నట్టుగా ఉందట.

అంటే ఆయనే అలా రాశాడు అంటే వాస్తవం ఏంటి ? కేసీఆర్ డిపాజిట్ గల్లంతు అవుతోంది అనేనా ? ఎందుకంటే ఆయనే 80 సీట్లు వస్తాయన్నాడు కాబట్టి బ్యాలెన్స్ చేస్తూ రాస్తాడు సహజంగానే. ఎందుకంతే తాను రాసింది తానే ఖండించుకోలేడు కదా ! కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే జనం అభిప్రాయాన్ని ఆయన అచ్చుగుద్దినట్టు చెప్పాడు. తెలంగాణలో జనం ఏమనుకుంటున్నారో తెలిసిపోయింది. కేసీఆర్ ఓడిపోవడం ఖాయం అయిపోయింది. అదీ మేటర్ !

-->