అప్పుడు చంద్రబాబు చేతుల మీదగా అవార్డు అందుకున్న బుడ్డోడు ఇవాళ అసెంబ్లీలో టీడీపీని ఆడుకున్నాడు !

చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ కుర్రోడు రాష్ట్రంలో టెన్త్ క్లాస్ టాపర్లలో ఒకడు. రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు. అప్పటి సీఎం చంద్రబాబు చేతుల మీదగా అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు అదే కుర్రోడు అసెంబ్లీలో ఆడేశాడు టీడీపీని ! కాలం గుర్రంలా పరిగెత్తడం అంటే ఇదే ! కాకపోతే ఒక్కటే పాయింట్. చంద్రబాబు అప్పుడూ ఇప్పుడూ అంతే కీలకంగా ఉన్నాడు. అది కూడా గుర్తు పెట్టుకోవాలండోయ్ !

అవును. పలాస ఎమ్మెల్యే అప్పల రాజు గురించే ! బహుశా 1995లో అనుకుంట. అప్పల రాజు టెన్త్ క్లాస్ లో థర్డ్ ర్యాంకర్. చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ఏం అవ్వాలనుకుంటున్నావ్ బాబూ అని చంద్రబాబు అడిగాడు అప్పుడు. డాక్టర్ కావాలనుకుంటున్నా అని చెప్పాడు అప్పలరాజు. నిజంగానే డాక్టర్ అయ్యాడు. రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. మొన్న ఎన్నికల్లో నిలబడ్డాడు గెలిచాడు. అసెంబ్లీలో అడుగు పెట్టాడు. మంచి వాగ్ధాటి ఉన్నవాడు. ఆసంగతి ఇవాళ చంద్రబాబు స్వయంగా చూశాడు. రైతు సమస్యల మీద చర్చ జరుగుతున్నప్పుడు అప్పలరాజు లేచాడు. చంద్రబాబు మహా గొప్ప నాయకుడు అంటూ వెటకారంగా మొదలు పెట్టాడు. విజయవాడలో ఎమ్జీ రోడ్డులో ఆయన హోర్డింగ్ ఉండేదండీ, ఆయన ఎడ్లబండి మీద ఉన్నట్టు, రైతులను ఆదుకున్నట్టు అందులో రాశారు. నిజంగా అది నిజం అయితే బావుండేది. ఏపీలో రైతులు బాధ పడేవాళ్లు కాదు అంటూ మొదలెట్టి టీడీపీని ఆడేశాడు. చంద్రబాబు గారు ఏమైనా అంటే , మాకు రక్తం పొంగిపోతోంది అంటారండీ, నిజాలు మాట్లాడితే మరి పొంగిపోదాఅండీ అంటూ ట్రెండీగా – సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్టుగా మాట్లాడాడు అప్పలరాజు. అప్పుడే చిన్న గుసగుసగా మొదలైంది ఓ టాక్. ఈ అప్పలరాజుకి టెన్త్ లో ఉండగా చంద్రబాబు సన్మానం చేశాడు. ఇప్పుడు అదే అప్పలరాజు మనల్ని ఆడుతున్నాడు అని మాట్లాడుకోవడం కనిపించింది.

కాకపోతే ఒక పాయింట్. చంద్రబాబు లాంగ్ ఇన్నింగ్స్ ఆడాడు రాజకీయంలో. ఆడుతున్నాడు. అప్పలరాజుకి అవార్డు ఇచ్చిన్పపుడు ఆయన సీఎం. అప్పలరాజు చదివి డాక్టర్ అయి, తర్వాత అసెంబ్లీలోకి వచ్చినప్పుడు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. బహుశా అప్పలరాజు అలా ఉండగానే ఆయన ఇంకోసారి పగ్గాలు అందుకుంటాడేమో కూడా ! చూద్దాం.

-->