గుంటూరు జిల్లాలో జగన్ కి షాక్ ! జంపింగ్ కి ముందే చంద్రబాబు రివర్స్ ప్లాన్ !

జిల్లాల వారీగా వన్ బై వన్ చేరికలు చేసుకుంటూ, అడుగూ బొడుగూ పోగేసుకుంటోంది వైసీపీ. ఇలాంటి టైమ్ లో గుంటూరులో జగన్ కి రివర్స్ షాక్ ఇచ్చాడు చంద్రబాబు. భారీ చేరిక, రెడ్ల ఓట్లకి గండి పడే ప్లాన్ సిద్ధం అయిపోయింది. రేపో మాపో రాక ఉంటుందని, గుంటూరు జిల్లాను ఊపే స్థాయిలో ఊరేగింపు చేస్తారని చెబుతున్నారు. ఇంతకీ ఎవరో తెలుసా ?

కాసు ఫ్యామిలీ ముందు నుంచి కాంగ్రెస్ వైపే ఉంది. టీడీపీకి బద్ధ వ్యతిరేకం. గుంటూరు జిల్లా రెడ్లలో పట్టు ఉన్న కుటుంబం. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ వరకూ కాసు క్రిష్ణా రెడ్డి పట్టు కంటిన్యూ అయ్యింది. ఆ తర్వాత కాంగ్రెస్ కి తగిలిన దెబ్బలతో ఆయన సైలెంట్ అయిపోయారు. మూడేళ్ల నాడు కాంగ్రెస్ తో బంధం తెగిపోయింది. అప్పటి నుంచి ఆయన టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జిల్లాలో గట్టిగానే ఉంది. కాకపోతే కొడుకు మహేశ్ రెడ్డి ఓ రోజు మధ్యాహ్నం జగన్ ఇంటికి కారు వేసుకొని వెళ్లిపోయి కండువా కప్పించేసుకున్నాడు. ఉడుకు రక్తం. కుర్రాడు కదా తెలుసుకుంటాడు అని క్రిష్ణా రెడ్డి సన్నిహితులు అన్నారు. ఇప్పుడు అదే మాట నిజం అయింది. మహేశ్ రెడ్డికి జ్ఞాన బల్బు వెలిగిపోయింది. జగన్ రెడ్డిని దగ్గరగా చూసిన మహేశ్ రెడ్డి ఇక తెలుసుకున్నాడు.

పై పెచ్చు ఇప్పుడు టీడీపీ హవా నడుస్తోంది. పథకాలు, హడావుడి, జనంలో హంగూ అన్నీ టీడీపీకే ఉన్నాయ్. అందుకే ఆయన టీడీపీలోకి రావాలని బలంగా కోరుకుంటున్నాడు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే అతి త్వరలో ఆయన చేరిక ఉంటుంది. అదే జరిగితే నరసరావు పేటలో సినిమా మరోలా ఉంటుంది. ఇప్పుడు గుంటూరోళ్లు పోయేవాళ్లూ పోనీ వచ్చే వాళ్లని రానీ అని సాంగ్ వేసుకోవాల్సిన టైమ్ వచ్చేసింది.

-->