నెల్లూరులో జగన్ కి డబుల్ షాక్ టీడీపీలోకి ఆ ఇద్దరు !

సంచి లాభం చిల్లు దొబ్బటం అంటే ఇదే ‍! షాపోడు చూడకుండా రెండు టమాటాలు లోపలేసుకుంటే, ఆల్రెడీ లోపలున్న ఉల్లి గడ్డలు బయట పడ్డట్టు అయిపోతోంది జగన్ పరిస్థితి. వైసీపీలోకి టీడీపీ నేతల్ని లాక్కుంటుంటే ఆల్రెడీ వైసీపీలో ఉన్న వాళ్లు టీడీపీలోకి జంప్ కొడుతున్నాడు. నెల్లూరులో ఏకంగా ఇద్దరు ఓకేసారి టీడీపీలోకి వచ్చేస్తున్నారు. ఇది గేమ్ ఛేంజరే !

నెల్లూరు లెక్కల ప్రకారం వైసీపీకి చాలా కీలకం అయిన జిల్లా. ఓ రకంగా జగన్ కంచు కోట. ఉప ఎన్నికల్లో అయినా, మొన్నటి 14 పోల్స్ లో అయినా అక్కడ జగన్ పార్టీ డామినేట్ చేసింది. ఇప్పుడు మాత్రం కోటకి బీటలు పడుతున్నాయ్. ఇద్దరు కీలక నాయకులు సైకిల్ ఎక్కుతున్నారు. ఒకరు కాటంరెడ్డి. రెండు వంటేరు. కాటం రెడ్డి విష్ణు వర్థన్ రెడ్డి కావలి నాయకుడు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్లాడు. ప్రభావం చూపే నాయకుడు. గత ఎన్నికల్లో కావలి సీటు వైసీపీ గెలవడంలో కాటం రెడ్డే కీలకం. ఒకప్పుడు ఇది టీడీపీ స్థానం. 2009లో బీద మస్తాన్ గెలిచాడు టీడీపీ తరపున. 14లో మాత్రం రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గెలిచాడు వైసీపీ తరపున. ఇప్పుడు కాటం రెడ్డి తప్పుకుంటే లెక్క తిరగబడుతుంది. ఇక వంటేరు వేణు గోపాల్ రెడ్డి ఒకప్పుడు టీడీపీ నాయకుడే ! 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున లోక్ సభ స్థానానికి పోటీ చేశాడు. తర్వాత వైసీపీలోకి దూకాడు టీడీపీ తరపున 99లో కావలిలో గెలిచాడు టీడీపీ తరపున. ఇప్పుడు వీళ్లిద్దరూ టీడీపీలోకి వస్తే రెండు ప్రభావాలు ఉంటాయ్. ఒకటి రెడ్ల ఓటు బ్యాంకులో కోత. రెండోది టీడీపీకి జనంలో ఉన్న మద్దతు ఓట్లుగా మారేందుకు ఈ చేరికలు సాయపడతాయ్.

ఆల్రెడీ మాట్లాడుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయ్. ఇప్పటికే జగన్ కి రాజీనామా లేఖలు కూడా సిద్ధం చేశారని, ఇక ఇచ్చి వచ్చేయడమే ఉంటుందని వీళ్లిద్దరి వర్గీయులూ అంటున్నారు. మొత్తానికి నెల్లూరులో గాలి మారింది, ఫలితాలు మారబోతున్నాయ్, వైసీపీ బొమ్మ తిరగబడుతోంది అనేందుకు వీళ్లిద్దరే ఎగ్జాంపుల్ !

-->