జగన్ కొంపలో కుంపటి పెట్టిన ఆది దెబ్బకి కడపలో వైసీపీ కేండిడేట్ ఛేంజ్ !

మనల్ని చూసి శత్రువు అడుగు వెనక్కి వేశాడూ అంటేనే యుద్ధంలో సగం గెలిచినట్టే ! కడపలో సరిగ్గా ఇదే జరుగుతోంది. ఆది రంగంలోకి దిగిన తర్వాత, గ్రౌండ్ రియాలిటీ అంతా తీసిన తర్వాత అవినాశ్ ను మళ్లీ బరిలో దింపే సాహసం చేయడం లేదు. అదే వైసీపీ పాలిట శాపం అయితాందా అనే అనుమానం కూడా వస్తోంది. ఎందుకంటే కుటుంబంలో కుమ్ములాటలకి అదే మూలం. ఇంతకీ ఆది ఎఫెక్ట్ జగన్ కుటుంబం మీద ఎలా పడిందో చూద్దాం !

ఊహించనే లేదు. ఆది నారాయణ కడప పార్లమెంటు అభ్యర్థిగా బరిలో దిగుతాడు అని జగన్ అనుకోనే లేదు. చంద్రబాబు చెబుతాడు. కానీ ఆది ఎందుకు దిగుతాడు ? జమ్మల మడుగు వదిలి రాడు అనుకున్నాడు. కానీ రెండు కత్తుల్ని ఒకే ఒరలో ఇమిడ్చాడు చంద్రబబాబు. సుబ్బారెడ్డిని జమ్మల మడుగులో పెట్టి, ఆదిని పార్లమెంటుకు పంపుతున్నాడు. అక్కడే వైసీపీకి చెమటలు పట్టడం మొదలైంది. ఎందుకంటే కడప పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో అసెంబ్లీ టిక్కెట్లు కూడా ఆది చెప్పినట్టే ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడిపోయాడు. గత ఎన్నికల్లో మారిది లెక్కలు లేవు. గెలిచే వాళ్లకే సీటు. సపోజ్, కడప అసెంబ్లీనే తీసుకోండి. బీసీ లెక్కలతో ఇచ్చాడు గతంలో. ఇప్పుడు మైనారిటీనే దించుకున్నాడు చంద్రబాబు. అదే జరిగితే ఇటు బీసీ, అటు మైనారిటీ కలిసి టీడీపీ గెల్చడం ఖాయం. ఇక మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేటలో కూడా రాజకీయ టీడీపీకే అనుకూలం. అంటే మామూలుగా ఉన్న పరిస్థితి మారిపోతోంది. పులివెందుల మినహా ఆరు చోట్ల టీడీపీ పైచేయి సాధించే స్థాయిలో పట్టు దొరికితే ఇక కడపలోజగన్ కి శృంగభంగం అవుతుంది. అంటే కురుక్షేత్రంలో దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టినట్టు కొట్టడమే అనమాట. అందుకే అభ్యర్థిని మర్చాలి అని జగన్ అనుకుంటున్నాడు. బాబాయిని దించితే బావుంటుంది అని తాను అనుకుంటుంటే, ఫ్యామిలీ మాత్రం ఒప్పుకోవడం లేదు అని చెబుతున్నారు.

మరి షర్మిలకు టిక్కెట్ ఇస్తే భారతి ఒప్పుకుంటారా ? అసలు బాబాయి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ ఏం కోరుకుంటోంది అనేది కూడా పాయింటే ! అంటే ఈ మూడు కోణాల్లో వైసీపీకి టెన్షన్ పెరుగుతోంది. ఒకవేళ అవినాశే దిగాడు బరిలో అంటే, టీడీపీ హ్యాపీ. ఎందుకంటే కడప ఎంపీ అయిపోతాడు ఆది. లేదూ ఎవరినైనా దింపితే జగన్ బంధువులే ఓడిస్తారు. అప్పుడు కూడా అడ్వాంటేజీ ఆదికే !

-->