కూకట్ పల్లిలో ప్రచారంపై జూనియర్ నిర్ణయం ఇదే ! చెప్పేశాడు !

చంద్రబాబు నిర్ణయం చక్రం లాంటిది. తిరుగుతూ ఉంటుంది. తిప్పేస్తుంది పరిస్థితుల్ని కూడా ! అంచనా వేయడం, అందుకోవడం అంత ఈజీ కాదు. అందుకే కూకట్ పల్లి విషయంలో సందిగ్ధంలో పడ్డాడు జూనియర్. ఇంతకీ వస్తున్నాడా ? రావడం లేదా ? సన్నిహితుల దగ్గర ఏం చెప్పాడో చూడండి !

వస్తాడా ? రాడా ? అంటూ చపాతీ పిండి పిసికినట్టు ఎటూ తేలకుండా ఉంది చర్చ. వస్తే చంద్రబాబు ప్రస్తావన తేవాలి. పార్టీతో ఉన్నట్టు చెప్పాల్సి వస్తుంది. అసంతృప్తికి ఆస్కారం లేదు. పై పెచ్చు కట్టుబడి ఉండాలి. తొమ్మిదేళ్లుగా చేసిన ఆలోచనలు అన్నీ పక్కకిపోతాయ్. అందుకే చూస్తూ చూస్తూ దిగలేడు. అలాగని దిగకుండానూ ఉండలేడు. ఎందుకంటే అక్కడ. ఫ్యామిలీతో మళ్లీ ఇప్పుడే కలిశాడు. పూర్తిగా దగ్గరగా ఉంటున్నా అంటున్నాడు. ఇప్పుడు కనుక ప్రచారం చేయకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంతో బుడ్డోడు నలిగిపోతున్నాడు. అందుకే సన్నిహితుల దగ్గర సూచన ప్రాయంగా ఓ మాట చెప్పాడు. సుహాసినీ అక్కయ్య కోసం మనం అంతా ప్రచారం చేద్దాం. కల్యాణ్ రామ్ అన్నయ్య ఎలాగూ తిరుగుతాడు. నేను మాత్రం నేరుగా రాలేదు. నా సందేశం, నేను చెప్పాలనుకున్న మాట వీడియో ద్వారా చెబుతాం. తప్పేముంది ? గతంలో, 2009లో కూడా ఇలాగే వీడియో విడుదల చేశాం పార్టీ కోసం. గుర్తుందిగా ! తప్పు పట్టడానికి లేదు. శంకించడానికి కూడా కుదరదు. అలాగని మనం దూరంగా ఉన్నట్టు కాదు. అన్నిటికీ సమాధానం చెప్పినట్టు ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇలా ప్రొసీడ్ అయితే ఎలా ఉంటుంది అని అభిప్రాయం బైట పెట్టాడు అంటున్నారు. ఇప్పటికైతే నడుస్తున్న చర్చ ఇది.

బహుశా నిర్ణయం కూడా ఇంచు మించు ఇలాగే ఉండొచ్చు అనిపిస్తోంది చూడబోతే ! అటు నుంచి బాలయ్య అయితే ప్రచారానికి రావడం ఖాయం. చంద్రబాబు కూడా దిగుతాడు. అవసరం అయితే భువనేశ్వరి బ్రాహ్మణి కూడా వస్తారని అంటున్నారు. మరి ఇంత మంది వచ్చినప్పుడు కలిసి ఉన్నామని చెప్పేందుకు తానూ రావడమా, పొరపొచ్ఛాలున్నాయని వీడియోతో చెప్పడమా అనేది చూడాలి !

-->