అక్కను అభిమానిస్తాడు సరే ‍! చంద్రబాబుకి సహకరిస్తాడా ? జూనియర్ ట్వీట్ ఏం చెప్పింది ?

జూనియర్ మాటెత్తగానే టీడీపీ వీర విధేయులు కొందరికి మనసు లోతుల్లో ఉలికిపాటు కనిపిస్తుంది. ఆ టాపిక్ స్కిప్ చేద్దాం అంటారు వీళ్లు ! పార్టీ మీద అభిమానం ఉంటుంది. బుడ్డోది మీద అనుమానం ఉంటుంది. అందుకే ఎటు మాట్లాడితే ఏం అర్థం వస్తుందో అని కంగారు ఇదంతా ! కానీ ఇంత అవసరం లేదు. కూకట్ పల్లిలో సుహాసిని దిగుతున్న టైమ్ లో అయినా క్లియర్ గా మాట్లాడదాం ! చంద్రబాబు లాంటి శిఖరం ముందు జూనియర్ రియాక్షన్ అనేది ఓ ఫ్యాక్టరే తప్పితే అదే ఆన్ ఇన్ వన్ కాదుగా ! అయితే ఇప్పుడు మేటర్ ఏంటి ? జూనియర్ ట్వీట్ ఏం చెప్పింది ?

జూనియర్ అక్కయ్యకి శుభాకాంక్షలు చెప్పాడు. ఎప్పటిలాగే తమ్ముణ్ని అన్నయ్య కల్యాణ్ రామ్ ఫాలో అయ్యాడు. తాతగారి మాట తల్చుకున్నారు మనవలిద్దరూ ! సమాజమే దేవాలంయ – పేదలే దేవుళ్లు అన్నారు. ఓకే. అందరూ సహకరించాలని, నాన్న లేని లోటు వెంటాడుతున్న వేళ కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పారు. ప్రచారం ఊసు మాత్రం లేదు. పైగా ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నిజం. ఎందుకంటే ఇంకా 20 రోజులకిపైగా సమయం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సుహాసినికి జూనియర్ ప్రచారమో, విచారమో నిజానికి అక్కర్లేదు. పసుపు జెండా తోడు చాలు. పైగా చంద్రబాబు అటు మీదుగా వెళితే చాలు. హైద్రాబాద్ వచ్చినప్పుడు కూకట్ పల్లికి ఓ పది నిమిషాలు కేటాయిస్తే చాలు. అంతకు మించి ఏం అక్కర్లేదు. కానీ అభిమానం అనేది ఒకటి ఉంటుంది. అన్నిటికీ మించి టీడీపీ అభిమానులకి పై పెచ్చు నందమూరి ఫ్యామిలీని పిచ్చిగా నెత్తికెత్తుకునే వాళ్లకీ క్యూరియాసిటీ ఉంటుంది. అందుకే జూనియర్ వస్తాడా రాడా అనే చర్చ. పైగా బాలయ్య కూడా అన్నాడు. షూటింగ్ షెడ్యూల్స్ ని బట్టీ, ఎవరు వస్తారు ఎవరు రారు అనేది ఆధారపడి ఉంటుంది అన్నాడు బాలయ్య. అంటే వస్తారో రారో చెప్పలేదు. కుటుంబంలో కూడా ఇప్పటి వరకూ క్లారిటీ లేదనే అర్థం అవుతోంది. హరన్న కార్యక్రమాల్లో అన్నీ తానై చూసుకొని తారక్ నీ, కల్యాణ్ రామ్ ని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడిన పెద్ద దిక్కు బాలయ్యకే క్లారిటీ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది ?

ఎన్టీఆర్ మనసులో ఏదో ఉంటుంది. చెప్పడు. చంద్రబాబు అడగడు. అదే అసలు విషయం. నువ్ పార్టీ కోసం పని చేయాలనుకుంటే యు ఆర్ వెల్ కమ్. ఎవ్వరో నిన్న పిలవాల్సిన పని లేదు అన్నట్టు ఉంటుంది టీడీపీ వైఖరి. నన్ను పిలిస్తేనే వస్తా అని బిగుసుకుపోయినట్టు ఉంటాడు జూనియర్. పై పెచ్చు జూనియర్ పక్కన ఉండే గుడివాడో గన్నవరమో అన్న వరమో ఏవేవో ఊదుతుంటాయ్ చెవుల్లో. ఇలాంటప్పుడు కాన్ ఫ్లిక్ట్ పెద్దదిగా కనిపిస్తుంది. అంతే ! చంద్రబాబు ముందు ఇవన్నీ వచ్చిపోయే సీన్లు లాంటివే ! నిలిచి ఆడే సినిమాలు కాదుగా !

-->