ఆ ఎంపీ బేరం పెట్టాడు ! కళ్లు చెదిరే సమాధానం చెప్పాడు చంద్రబాబు !

పోతే పోనీ పోరా ! అనేశాడు ! ఒత్తిడి పెంచాలనుకుంటారు కొందరు. బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటారు కొందరు. ఎవరో వెళిపోతున్నారు అని వాళ్ల పేరు చెప్పి పబ్బం గడుపుకోవాలనుకుంటారు ఇంకొందరు. ఏం ఏమనుకుంటున్నారు ? జనం మనతో ఉన్నంత కాలం ఇలాంటి వాటికి భయపడాల్సిన పని లేదు అని తేల్చేశాడు చంద్రబాబు. ఇంతకీ బేరం పెట్టింది ఏ ఎంపీ ? ఏం జరిగింది అసలు ?

మళ్లీ టిక్కెట్ రాదు అని అనుమానం ఉన్నవాళ్లు జారుకుంటున్నారు. గత ఎన్నికల ముందు మైసూరారెడ్డి టైపులో కొందరు నాయకులు నిర్ణయం తీసుకుంటున్నారు. అమలాపురం బాలయోగి కొడుక్కి ఖరారు అయ్యాక పందుల రవీంద్ర బాబు కూడా తప్పుకున్నాడు. ఓకే. ఇలా వెళుతుంటే చంద్రబాబు బలహీన పడుతున్న ఫీలింగ్ తో ఉంటాడు అనుకున్నాడో, లేదంటే ఇలాంటప్పుడు బేరం పడితే వర్కవుట్ అవుతుంది అనుకున్నాడో కానీ మధ్య కోస్తా జిల్లాలో రాజకీయ ముదురు ఎంపీ చంద్రబాబుకి ఓ ప్రపోజల్ పెట్టాడు. నాకు ఓ సీటు, నా కొడుక్కి ఓ సీటు కావాలి అని కండిషన్ పెట్టాడు. వర్తమానం పంపాడు. ఆయన ఏం చేసినా కొడుకుతో కలిసి చేస్తాడని గతంలో ఒకామె చెప్పింది లెండి. ఇప్పుడు మరీ అంత డెప్త్ కి పోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రం విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని, రాజకీయం విషయంలో కూడా నిక్కచ్చిగా ఉంటానని ఆయన కాంట్రాక్టును వెనక్కి తీసుకొని మరీ నిరూపించాడు చంద్రబాబు. అయినా ఆయన మాత్రం ఇదే ధోరణిలో ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు ఇప్పుడు ఒత్తిడిలో ఉన్నాడు, జగన్ వైపు చేరుతున్నారు నాయకులు అనుకుంటున్నారు అని భావించాడు. రాయబారం పంపితే చంద్రబాబు మాత్రం దిమ్మదిరిగే ఆన్సర్ ఇచ్చాడు.

ఏంటి ఏమనుకుంటున్నారు ? బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ? ఎవరికి ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో నాకు తెలియదా ? ఆయన కూడా వెళతానంటే వెళ్లమనండి. ఆపే ఉద్దేశం లేదు. ఉండాలనుకున్నవాళ్లే ఉండొచ్చు. జనం మనతో ఉన్నారు. వాళ్లే గెలిపిస్తారు. అప్పుడు వీళ్లంతా మన గుమ్మాలవైపు చూస్తారు అంటూ తేల్చేశాడు. అంటే పార్టీ పరిస్థితిపై, జనంలో ఉన్న మూడ్ మీద చంద్రబాబు ఎంత ఊపుగా ఉన్నాడో చెప్పేందుకు ఇదో ఎగ్జాంపుల్. అదీ లెక్క. కిక్కు !

-->