ఎందుకు అడ్డుకోవాలి చంద్రబాబుని ? గడీ కూలగొడతడని భయమా కేసీఆర్ ?

కేసీఆర్ ది హీరోయిన్ల స్ట్రాటజీ. వాళ్లు కూడా అంతే. అందంగా లేని వాళ్లని పక్కన పెట్టుకొని తిరుగుతారు. ఎలివేట్ అవుతారని ! కేసీఆర్ కూడా అంతే. తన కన్నా సమర్థుల్ని తట్టుకోలేడు. మోడీ లాంటి వాళ్లతో తిరుగుతాడు. ఆ ఫెయిల్యూర్ తో పోలిస్తే తన ఫెయిల్యూర్ చిన్నగా కనిపిస్తుందేమో అనే ఆశ ! అందుకే చంద్రబాబును అడ్డుకోవాలి అంటున్నాడు. అవునా ? అంత భయపడుతున్నాడా ? బాబు దిగితే కేసీఆర్ కోటలు ఉన్న పళాన కూలుతాయా ?

ఇంతకీ చంద్రబాబును ఎందుకు అడ్డుకోవాలి కేసీఆర్ ? సమాధానం చెప్పు చూద్దాం. అసలు నీ భయం ఏంటో తెలిస్తే తెలంగాణ సమాజానికి అర్థం అయిపోతుంది నువ్వెంత పిరికి పందవో !

– మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం నీ చేతిలో పెట్టారు. 5 వేల కోట్లు. 16 వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం చంద్రబాబు చేతికి వచ్చింది. మరి తెలంగాణ కన్నా ఏపీ ఎందుకు ముందు ఉంది పెట్టుబడుల్లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో, గ్రోత్ రేటులో ? ఎలా సాధ్యమైంది ? పైగా నీలాగా ఇవన్నీ దొంగ లెక్కలు కాదు. కేంద్రం ప్రకటించిన , ప్రపంచ బ్యాంకు గుర్తించిన లెక్కలు

– మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కదా తెలంగాణ. ఎన్ని ఉద్యోగాలిచ్చావ్ ? ఎన్ని డీఎస్సీలు వేశావ్ ? చేతిలో చిల్లి గవ్వలేని చంద్రబాబు రెండు డీఎస్సీలు వేశాడు. 28 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. లక్షా 70 వేల మందికి పైగా ప్రత్యక్షంగా ప్రైవేటు సెక్టర్ లో ఉపాధి కల్పించాడు. స్కిల్స్ డెవలప్ మెంట్ ఇండెక్స్ లో వరసగా ఏపీనే టాప్ లో ఉంది. తెలంగాణ ఈ నిమిషానికి టాప్ టెన్ లో కూడా లేదు. ఎవరిది సమర్థత ?

– మిగులు బడ్జెట్ ఉన్నది కదా, తెలంగాణలో నీటి సమస్య ఉన్నది కదా – ఎన్ని ప్రాజెక్టులు కట్టావ్ ? ఎందరికి నీళ్లిచ్చావ్ ? పట్టిసీమ, పురుషోత్త పట్నం, ముచ్చుమర్రి చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా చంద్రబాబుది. సీమను కరువు నుంచి కాపాడాడు. క్రిష్ణా డెల్టాలో మళ్లీ చిగుళ్లు రప్పించాడు. నువ్ ఏం చేశావ్ ? – ఎవరో కేసులు పెట్టారని మంగళారం కబుర్లు చెబుతావ్ – పోలవరం మీద నువ్వెంత కిరికిరి పెట్టినవ్ ? ఒడిషా ఏం చేసింది ? జగన్ బ్యాచ్ ఎన్ని గండ్లు కొట్టింది ? ఆఖరికి మోడీ ఎలా బిడాయించాడు ? అగిందా పోలవరం ? సాధకుడు ఎప్పుడూ అవ్వడానికి అవకాశాలు చూస్తాడు. నీలాంటి చేతకానోడే కాలేదు అని చెప్పడానికి కారణాలు వెదుకుతాడు

– రాజధాని కూడా లేని రాష్ట్రం పరిశ్రమల్ని ఎలా ఆకర్షిస్తోంది ? కియా లాంటి ఇండస్ట్రీ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా వచ్చిందా నాలుగున్నరేళ్లలో ? వజ్రపు తునక లాంటి హైద్రాబాద్ ని నీ చేతిలో పెడితే ఏం చేసినవ్ ? దాంతో వీపు గోక్కున్నవా ? చేతగాని తనానికి నమూనా కాదూ నీ జమానా ! ఇంకా మాట్లడతవా ?

– నేను కట్టే ఒక్క ఇల్లు ఏడిళ్లకి సమానం అంటవా ? ఊరుకుంటే వారానికి ఒక్కసారే తినమంటవేమో కూడా ! కబుర్లు చెప్పేటందుకైనా హద్దూ పద్దూ ఉండాల కేసీఆర్. నేను ఎత్తబట్టే సూరీడు లేస్తన్నడు. నేను చూపించబట్టే మీరు ప్రపంచాన్ని చూస్తున్నరు అంటే నడవది అన్నిసార్లూ ! మరి లోటు బడ్జెట్ లో ఉన్న చంద్రబాబు ఎనిమిది లక్షల ఇళ్లు ఎలా కట్టిండు ? నువ్ కనీసం పట్టుమని పదివేల ఇండ్లు కూడా కట్టలేకపోతివేమి ? చేత గాదా ? ఐదేళ్లలో 13 లక్షల ఇళ్లు పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డులు బద్దలు కొడుతున్నది కదా ! మరి నువ్వేం చేసినవ్ ?

చేతగాదు నీకు చేయలేవు నువ్. ఫామ్ హౌస్ లో పండుడు. లొడలొడ వరుగుడు. ఇంతేనా బతుకు ? చంద్రబాబు వస్తే పోలికొస్తదని, నిన్ను తరిమి కొట్టలని తెలంగాణ పొలికేక పెడతదని లాగూలు తడుస్తున్నయి లే నీకు ! బాబు దిగుతాడన్న ఆలోచనే నిన్ను భయపెడుతోంది చూశావా – ఆడు నాయకుడు అంటే ! అయినా ఒక్కటి తెల్సుకో కేసీఆర్ – చంద్రబాబు లాంటి సమర్థుడి చేతిలో ఓడిపో. గౌరవం కాస్తో కూస్తో నీకు. ఇలా వాగినవనుకో లాగులూడతయి జాగ్రత్త !

-->