కేసీఆర్ కేబినెట్లో రేవంత్ ‍! డీల్ ఓకే అయ్యిందా ?

తెలంగాణ రాజకీయంలో పెను సంచలనం ఉంటుందా ? ఉప్పూ నిప్పులా ఉన్న రేవంత్ – కేసీఆర్ కలిసే అవకాశం ఉందా ? ఆల్రెడీ లైజొనింగ్ అయిపోయిందన్న మాట అంటున్నదెవరు ? అసలు ఏం జరిగింది ? ఈ ప్రచారం ఎక్కడ పుట్టింది ?

తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ పెద్దగా కనిపించడం లేదు. ఓ రెండు మూడు సార్లు మాట్లాడాడు. ఈవీఎంల తీరుపై అనుమానాలు ఉన్నాయ్ అన్నాడు. పట్నం గెలుపును సవాల్ చేస్తా అంటూ కేసులు కూడా వేశాడు. చాలా మంది దిగ్గజాలు ఓడారు. ఎన్టీఆర్ కూడా ఓడారు అంటూ అనుకూల ఉదాహరణలు వెదుక్కున్నాడు. అంత వరకూ ఓకే. ఇంతకాలం వ్యతిరేకిస్తూ, ఎవరి మీద అయితే పోరాడుతున్నారో అదే కేసీఆర్ తో కలుస్తాడన్న ప్రచారం పెడుతున్నది ఎవరు ? రాజకీయ వర్గాల్లో లోతైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు ఓ పద్ధతి ప్రకారం హరీశ్ ను తగ్గిస్తూ వస్తున్నాడు. అది కూడా చాలా వేగంగా ! కేటీఆర్ కి అడ్డం లేకుండా చేసుకోవడమే కాదు, టీఆర్ఎస్ పై గుత్తపెత్తనం కూడా కేటీఆర్ కి మాత్రమే ఉండేలా చూసుకోవాలన్నది వ్యూహం. ఇలాంటి లెక్కల్లో భాగంగానే రేవంత్ ను దగ్గరకి తీయాలన్న ఎత్తుగడ ఉందని, కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఓ కీలక వ్యక్తి దారి తెరిచారని టాక్ నడుస్తోంది. రేవంత్ ను తెచ్చి హరీశ్ ను తగ్గిస్తే, పార్టీ బాధ్యతల్లో వ్యవహారాల్లో పెత్తనం ఇస్తే రెండు జరుగుతాయ్. ఒకటి – తెలంగాణ రాష్ట్ర సమితిలో హరీశ్ శకం ముగిసిపోతుంది. రెండోది తెలంగాణలో బలమైన లీడర్ గా ఉన్న ఒకణ్ని తెచ్చి దొడ్లో కట్టేసినట్టూ ఉంటుందని లెక్క వేశారని చెబుతున్నారు. ఎంత వరకూ నిజమో తెలియదు. దానికి ఓ కండిషనల్ క్లాస్ కూడా చెబుతున్నారు.

పార్లమెంటు ఎన్నికల వరకూ సస్పెన్స్ ఉంటుంది అంటున్నారు. ఆ ఎన్నికల్లో బరిలో దిగి రేవంత్ కాంగ్రెస్ తరపున గెలిస్తే సరేసరి. లేకపోతే గనుక తర్వాత నిర్ణయం ఉంటుంది అంటున్నారు. మరి అంత వరకూ వస్తుందా ? వస్తే ఎలా ఉంటుందని చూడాలి. మొదట ఊహాగానంగా మొదలైన ఈ చర్చ ఇప్పుడిప్పుడే సిద్ధాంతంగా మారుతోంది. మరి ఆధారాలు ఎవరు చూపిస్తారో, అసలు ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో చూడాలి !

-->