చంద్రబాబు రాహుల్ కలిస్తే కేసీఆర్ ఇలా దొరికిపోయాడేంటి ? ఓడిపోతాడు అంటోంది సొంత మీడియా !

ఎదురింటోళ్లు సినిమాకెళ్తే పక్కింటావిడ మొగుడితో గొడవకి దిగి రోడ్డున పడినట్టు అయిపోయింది కేసీఆర్ పరిస్థితి. కాంగ్రెస్ టీడీపీ కలిసే సరికి కాళ్లు ఒణుకుతున్నాయో ఏమో ఎటాక్ చేయబోయి ఏదోదో చేస్తున్నాడు ! ఏం మాట్లాడాలో తెలియక అయితే కాంగ్రెస్ కి లేదంటే టీడీపీకి మేలు చేసే లాజిక్కులు లాగుతున్నాడు !

అవును. కేసీఆర్ మీడియాను చూడబోతే ఇలాగే ఉంది. విభజన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పై విషం కక్కాడంటూ పాత బైట్లు తీసి వేస్తోంది కేసీఆర్ ఛానెల్. మంచిదే. కాంగ్రెస్ అడ్డగోలుగా విడగొట్టేసింది. తెలంగాణ ఇచ్చేసింది అని తిట్టాడు అందులో చంద్రబాబు ! అంటే ఇప్పుడు వాటిని చూపిస్తే ఏంటి అర్థం ? కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అని కదా ! అంటే కాంగ్రెస్ ఇవ్వలేదు నేనే తెచ్చా అని కేసీఆర్ చెబుతున్న మాట అబద్ధం అని కదా అర్థం. అలాగని ఆయన సొంత మీడియానే రుజువు చేస్తోంది. మరికాస్త ముందుకెళ్లి, ఇప్పుడు అవన్నీ మర్చిపోదాం అంటున్నాడు చంద్రబాబు. ఎంత దుర్మార్గం అంటోంది కేసీఆర్ మీడియా ! దుర్మార్గం చంద్రబాబుది కాదు. కేసీఆర్ దే అని అర్థం కావడం లేదు పాపం. విభజనతో నష్టపోయింది ఏపీ. రాజధాని లేకుండా పోయింది ఏపీ. అలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడే అవన్నీ మర్చిపోదాం అంటున్నాడు అంటే పాజిటివా ? నెగెటివా ? ఆ మాత్రం బుర్ర కూడా లేదు కేసీఆర్ మీడియాకూ ! చంద్రబాబే అన్నీ మర్చిపోయి కలిసిపోదామంటే తెలంగాణకేం ఇబ్బంది ? అక్కడ సగటు జనం కోరుకునేది కూడా ఇదే కదా ! లాజిక్ మిస్సవుతున్నాడు కేసీఆర్.

ఇక మరో పురాణం కూడా ఉంది. చంద్రబాబు కుట్ర పన్నాడు అంటోంది కేసీఆర్ మీడియా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా గుంజుకుపోతాడు ఏపీ కోసం అంటోంది. అంటే ఏంటి ? కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది అని కదా ! అంటే మోడీ ఓడిపోతాడు. బాబు సక్సెక్ అవుతాడు అని కదా ! పై పెచ్చు ఏపీలో మళ్లీ చంద్రబాబే గెలుస్తాడు. హోదా సాధించబోతున్నాడు అని కదా ! సూపర్ కదా ! మరి గెలిచే పార్టీ, కేంద్రంలో ఉంటే పార్టీ కాంగ్రెస్ ని కాదని – కేసీఆర్ కి ఓటేస్తే ఏమొస్తుంది బూడిద ? ఆ మాత్రం ఆలోచించుకోదా తెలంగాణ ? కచ్చితంగా ఆలోచిస్తుంది. అందుకే అంటున్నది ఫ్రస్ట్రేషన్ లో కేసీఆర్ మీడియా చంద్రబాబు కీ కాంగ్రెస్ కీ పాజిటివ్ చేస్తోంది. కేసీఆర్ ను గోతిలో తోస్తోంది. పాపం. నెగెటివ్ మైండ్ సెట్ దెబ్బ ఇలాగే ఉంటది !

-->