తుమ్మల, హరీశ్, ఈటల, కేటీఆర్ వీళ్లు కూడా కేసీఆర్ గెలిపించకపోతే ఓడిపోతారా ? కేసీఆర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి !

ఎహె, నీలాంటోళ్లతో మాట్లాడను. నీ పైన ఎవడున్నారో పిలువ్ అంటాడు పరేష్ రావల్ సీరియస్ గా ! నా పైన ఉన్నది జార్జిబుష్షే – పిలవనా అని కౌంటర్ వేస్తాడు అనిల్ కపూర్. ఇది ఓ సూపర్ హిట్ హిందీ సినిమాలో కామెడీ సీన్. తెలంగాణ ప్రచారంలో కొంచెం లోతుగా చూస్తే ఇంత కన్నా కామెడీ ఉంది. మహామహా బ్యాట్స్ మన్ అనుకున్నవాళ్ల తరపునే కేసీఆర్ బ్యాటింగ్ కి దిగాడు. అంటే వాళ్లకి కూడా సపోర్ట్ లేకపోతే ఓడిపోతారా ? అసలు పాయింట్ అదేనా ?

తెలంగాణ రాష్ట్ర సమితిలో ఓనర్ నుంచి క్లీనర్ వరకూ అన్నీ కేసీఆరే ! అనుమానం లేదు. కాకపోతే కాస్తో కూస్తో పేరు వినిపించేది, అప్పుడప్పుడూ కనిపించేది కొందరే. తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్ రావు, కేటీ రామారావు, ఈటల రాజేందర్. వీళ్లే ! ఇలాంటి వాళ్లు నిజానికి వాళ్ల ప్రచారాలు వాళ్లు చేసుకుంటూ, జిల్లా స్థాయిలోనో పార్టీ స్థాయిలోనో స్టేట్ లెవెల్లోనో మిగతా చోట్ల కూడా ప్రచారం చేయాలి. నిజానికి ఇదే కదా పరిస్థితి. కానీ సీన్ మారింది. వాళ్ల తరపున కూడా కేసీఆరే ప్రచారం చేస్తున్నాడు. కావాలంటే చూడండి. నిన్న ఖమ్మం. ఇవాళ సిద్దిపేట, సిరిసిల్ల, హుజూరాబాద్. అన్నీ వీళ్లవే ! అంటే తోపులు అనుకున్నవాళ్ల తరపునే పెద్ద తోపు ప్రచారానికి దిగాడు అంటే పరిస్థితి ఎంత దిగనాసిగా ఉన్నట్టు ? జస్ట్ కామన్ సెన్స్. ఆరోపణ కాదు. ఆలోచిస్తే అర్థం అయిపోద్ది. టీఆర్ఎస్ ఎంత భయంతో ఉందో, ఎంత డిఫెన్స్ లో ఉందో తెలిసిపోతుంది. పెద్ద నాయకుల తరపునే కేసీఆర్ బాధ్యత తీసుకున్నాడు అంటే మిగతా వాళ్ల పరిస్థితి చెప్పనే అక్కర్లేదు. పై పెచ్చు, గెలిచే చోటనే మొదట దృష్టి పెట్టారు అని టీఆర్ఎస్ చెబుతోంది. కానీ కాంగ్రెస్ మాత్రం అసలు కోణం చూపిస్తోంది. కనీసం వాళ్లని అయినా గెలుపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ అంటోంది. ఎవరి వాదన వారిది. రాజకీయం ఇలాగే ఉంటుంది కదా !

దీన్ని బట్టీ సినిమా అర్థం అయిపోతుంది. కేసీఆర్ కి పెద్దగా ఆశల్లేవు. కనీసం పెద్ద తలకాయల్ని అయినా ఒడ్డున పడేస్తే, అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు, అవకాశం ఉంటే ఎవరినైనా తనవైపు తిప్పుకోవచ్చు అనే ప్రయత్నంలా కనిపిస్తోంది ఇదంతా ! కానీ కార్యకర్తలు, జనం కేసీఆర్ అంటే తెలివైన వాళ్లు. ఆయన ప్రచారం అంతా పెద్ద పెద్ద నాయకుల కోసమే చేస్తున్నడంటే ఇక మిగతా వాళ్ల పరిస్థితి చెప్పేదేముంది ? చంద్రబాబు పెట్టిన కూటమి ఆలౌట్ యాడ్ లో వచ్చే మిషన్ దోమల్ని చప్పరించినట్టు చప్పరిచ్చేస్తోంది కావొచ్చు టీఆర్ఎస్ ని !

-->