కేంద్రం మళ్లీ షాకిచ్చింది ! చంద్రబాబు జోలికి పోవద్దని తేల్చేసింది !

మనకి కప్పులతో తాగే అలవాటు ఉండొచ్చు. అదే పక్కన తమిళనాడు కెళ్తే అక్కడ స్టీలు గ్లాసు లేనిదే తెల్లారదు. సైడు దాటి ఏ పంజాబో వెళ్లామనుకోండి అక్కడ ఇంత పొడుగాటి ఇత్తడి గ్లాసులు ఉంటాయ్. ఏం చేస్తాం ! ఇత్తడి గ్లాసులతో తాగడం వెనక కుట్ర ఉందనో, ఖర్చు ఎక్కువ పెట్టేసి దేశ సంపదని ఎటూ కాకుండా నాకించేస్తున్నారో గొడవ చేస్తే ఎలా ఉంటుంది ? తప్పు కదా ! నీ చిట్టిబుర్రకి ఇది కూడా తట్టలేదా తండ్రీ అని దగ్గరకు తీసుకొని ఓదార్చడం తప్ప ఇంకేం చేయగలం ? విద్యుత్ ఒప్పందాల విషయంలో నెల రోజులు తిరగక ముందే కేంద్రం ఇదే చేసింది. జగన్ కి లేఖ రాసింది. ఆ లేఖలో ఏముందో తెలుసా ?

సోలార్ పవర్ ఎక్కువ ఖరీదుకి కొన్నారట చంద్రబాబు. విద్యుత్ ఒప్పందాలు చాలా వరకూ సొమ్మును వృధా చేసేవిగా ఉన్నాయట. చంద్రబాబు హయాంలో ఒప్పందాలతో ఏపీ నష్టపోయిందట. ఇదీ ముందు నుంచి జగన్ ఆరోపణ. దీనికోసం ఓ కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ కూడా అవును. ఈనింది దున్నే అని తేల్చింది. దాదాపు 2 వేల కోట్ల మేర ఎక్కువ ఖర్చు పెట్టారని తేల్చేసింది దాదాపుగా ! ఇలాంటి సమయంలో ఆ కంపెనీల నుంచి డబ్బులు రాబడతామని, లేదంటే ఒప్పందాలు రద్దు చేస్తామని జగన్ అంటున్నారు. అలా అనడం సరికాదని – ఒప్పందాలు పారదర్శకంగానే జరిగాయని కేంద్రం ఇప్పటికే ఎల్వీ సుబ్రమణ్యానికి లేఖ రాసింది నెలన్నర కిందట. ఇప్పుడు నేరుగా జగన్ కి రాసింది. విద్యుత్ ఒప్పందాలు అనేవి రాష్ట్రాన్ని బట్టీ ఉంటాయ్. ఓ రాష్ట్రానికీ మరో రాష్ట్రానికీ తేడా ఉంటుందని తేల్చింది. సపోజ్ సూర్య రశ్శిని బట్టీ సోలార్ ఒప్పందాలు జరుగుతాయనే ఉదాహరణ చెప్పింది. ఒప్పందాలు సమీక్షిస్తామని – గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటిని రద్దు చేస్తామని అనడం ఇప్పటి వరకూ ఎక్కడా చూడలేదని కేంద్రం తేల్చింది. ఇలాంటి ధోరణి రాష్ట్రానికే మంచిది కానీ, దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా ప్రభావం పడుతుందని హెచ్చరిక చేసింది. ముందు ముందు పెట్టుబడులు రాకుండా పోతాయని, అగ్రిమెంట్ చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది కూడా !

కేంద్ర ఇంధన మంత్రి సింగ్ క్లియర్ గా లేఖ రాశారు జగన్ కి ! దాంతోపాటు ఏ రాష్ట్రంలో ఎంత రేటు ఉందో ఎందుకు ఉందో కూడా క్లియర్ గా పట్టిక వేసి మరీ చూపించారు. అంటే దీనర్థం ఏంటంటే ఎప్పుడైనా ఏకపక్షంగా కక్ష కట్టినట్టు పోతే రాష్ట్రం నష్టపోతుంది. అసలు మాట్లాడే ముందు విషయం తెలుసుకోవాలని, అవగాహన చేసుకోవాలని లేకపోతే అభాసుపాలవుతారని చెప్పకనే చెప్పినట్టు అవుతోంది. కేంద్రం రెండోసారి లేఖ రాసిన తర్వాత రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అదేంటో వాయిస్ ఆఫ్ ఆంధ్రా చెబుతుంది. కీప్ ఇన్ టచ్.

-->