లాస్ట్ బాల్ 7 రన్స్ కావాలి – రెండు సిక్సర్లు కొట్టాడు చంద్రబాబు కేసీఆర్ కి నాకౌట్ పంచ్!

మంచి నూనె సైడ్ఎఫెక్ట్స్ ని కొబ్బరి నూనె తగ్గించినట్టు, పంచదార వాడకాన్ని తేనెతో సరి పెట్టినట్టు, కాంగ్రెస్ కి బుర్రలేని లోటును చంద్రబాబు వ్యూహంతో భర్తీ చేస్తున్నాడు తెలంగాణలో ! టిక్కెట్ల కేటాయింపులో లాస్ట్ 2 సిక్సర్లు చూశాక తప్పక తప్పదు ఈ మాట. కేసీఆర్ కి రావాల్సిన పావలా అడ్వాంటేజ్ కూడా బాబు ఎఫెక్ట్ తో పోయింది !

మటన్ షాపు ముందు టామీ వెయిట్ చేసినట్టు ఎదురు చూశాడు కేసీఆర్. మహా కూటమి సీట్ల ప్రకటన వచ్చాక ఇక తన్నుకు చస్తారు. నేను ఎగరేసుకుపోతా చూస్తుండండి అన్నాడు. అక్కడే ఓడిపోతున్నానని ఒప్పుకున్నాడు. ఎందుకంటే సొంత బలం లేదు. ఎదుటివాడి వీక్ నెస్ మీద పడి గెలవాలనుకోవడం కదా అది. కానీ అది కూడా సక్సెస్ కాలేదు. మహా కూటమి సీట్లు అసంతృప్తికి కారణం అయితే అవ్వొచ్చేమో కానీ పడిన వికెట్లు చాలా తక్కువ. గతం ఎన్నికల్లో అమ్ముడు పోయిన ఒకరిద్దరు తేలారు నల్గొండ లాంటి జిల్లాల్లో. వాళ్లని అఢ్డుపెట్టుకొని బీసీ కార్డు బయటకి తీయాలనుకున్నాడు కేసీఆర్. అబ్బో కండువాలు కప్పి కోలాటం ఆడాడు. ఏదేదో చెప్పేందుకు సిద్ధం అయ్యాడు.

కానీ బాబు రంగ ప్రవేశంతో కాంగ్రెస్ రెండు సిక్సర్లు బాదింది. ఒకటి కాసాని జ్ఞానేశ్వర్. రంగా రెడ్డి జిల్లా బిగ్ షాట్. వచ్చేశాడు. రెండు బీసీ క్రిష్ణయ్య. మిర్యాల గుడాలో దిగాడు. జానా రెడ్డికి చెక్ పెట్టడంతోపాటు, ఆయనకే బాధ్యతలు అప్పిగించేలా చక్రం తిప్పాడు బాబు. కాసాని కూడా 15 రోజుల నాడే అమరావతి వచ్చి చంద్రబాబుు కలిశాడు. సమయం వచ్చినప్పుడు చూద్దామని చెప్పి పంపాడు. వచ్చింది సమయం. కొట్టాడు షాట్. 7 రన్స్ కావాలంటే రెండు సిక్సర్లలో 12 కొట్టాడు ఇప్పుడు. షాక్ లో టీఆర్ఎస్. సెలెబ్రేషన్స్ లో కాంగ్రెస్. ఇది గెలుపు ముందు వైబ్రేషన్.

-->