కేసీఆర్ వీక్ పాయింట్ ఏంటో కొండా లేఖలో చెప్పేశాడు ! కీలక సమయంలో అపోలో అల్లుడి దెబ్బ

తెలంగాణలో రెడ్లు అంతా ఏమవుతున్నారు అనుకోవడం తప్పు. తెలంగాణలో రాజకీయ ఏకీకరణ జరుగుతోంది అని చెప్పడం కూడా పూర్తిగా కరెక్ట్ కాదు. కాంగ్రెస్ రాజకీయ వ్యూహం అమలు చేస్తోందని అనడానికి అంత కన్నా లేదు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా వీటన్నిటికన్నా మించి ! చేవెళ్ల ఎంపీ చెప్పేశాడు కేసీఆర్ వీక్ పాయింట్ ఏంటో ! దీన్ని బట్టీ అర్థం అయిపోతోందో తెలంగాణ ఎన్నికల్లో ఏం జరగబోతోందో !

తెలంగాణ ఎన్నికల్లో బాంబు పేలింది. పొలిటికల్ బాంబు. చేవెళ్ల ఎంపీ సంగతి చెప్పేశాడు. కేసీఆర్ వీక్ నెస్ బైట పెట్టేశాడు. ఏం చెప్పాడో చూసే ముందు కొండా ఇమేజ్ ఎలాంటిదో చూద్దాం ! విశ్వేశ్వర్ రెడ్డి అల్లాటప్పా కాదు. ఏది బడితే అది మాట్లాడడు. పార్టీకి బద్ధుడు. పైగా అపోలో అల్లుడు. ఆ స్థాయి మెయింటైన్ చేస్తాడు. పార్లమెంటులో తరచుగా మాట్లాడిన వాళ్లలో విశ్వేశ్వర్ ముందుంటాడు. అవును. అలాంటి నాయకుడు ఇప్పుడు లేఖ రాయడం, తప్పుకోవడం అంటే టీఆర్ఎస్ వెన్నెముక విరిగి పోవడమే ! ఎందుకంటే ఒకటి కాదు ఐదు కారణాలు చెప్పాడు కొండా. పర్సనల్ గా తీవ్రమైన అసంతృప్తి ఉందన్నాడు. ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఉద్యమ కారుల్ని పట్టించుకోలేదు అని చెప్పాడు. అంతే కాదు, ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య దూరం పెరిగింది అని బైట పెట్టేశాడు. జనం ఏం కోరుకుంటున్నారో తెలుసుకోలేక పోతోంది అనేశాడు. అంతే కాదు జనంతో సంబంధం లేకుండా రాజకీయాలు చేద్దామనుకుంటే అయ్యే పని కాదు అనేశాడు. కొండా రాజీనామాముందు చెప్పిన మాటలు కేసీఆర్ కాళ్ల కింద పొలిటికల్ బాంబులు అవుతాయ్. ఎందుకంటే కచ్చితంగా తెలంగాణ ఏం అంటోందో అవే విషయాలు చెప్పాడు కొండా కూడా ! పై పెచ్చు తెలంగాణ కోరుకుంటున్నది ఏమిటో రాజీనామాతో తేల్చేసినట్టు అయ్యింది.

కేసీఆర్ పడవకి చిల్లు పడింది. ఇక మునుగుడు మొదలవుతుంది. రేవంత్ ముందు నుంచి చెబుతున్నాడు కేసీఆర్ పతనం ఖాయం అయ్యింది అని. ఇలాంటి సమయంలో రేవంత్ చెప్పినట్టే, కొండా రాజీనామా చేయడం అంటే సంచలనం కాదు.కల్లోలం. రాసి పెట్టుకోండి ఇది టీఆర్ఎస్ ని తుడిచి పెట్టడం ఖాయం !

-->