అన్నగారికి ఆమెతో ప్రత్యేక అనుబంధం ఉండేదా ? క్రిష్ ఎంత సున్నితంగా చూపించాడో !

సినిమాల్లో గ్లామర్ వెంటే రూమర్ కూడా ఉంటుంది. ఇప్పుడే కాదు ముందు నుంచి ఉందీ వరస. మేకప్ తీశాక,ప్యాకప్ చెప్పాక ఏం జరిగిందో తెలుసా అంటూ కథలు అల్లడం ముందు నుంచి మహా అలవాటు. ఎన్టీఆర్ కూడా అందుకు అతీతం కాదు. ఆమె అన్నగారి అనుబంధం గురించి అప్పట్లో చాలానే రాశారు. క్రిష్ మాత్రం ఎంతో సెన్సిబుల్ గా చూపించాడు.

బయోపిక్ అనగానే భావావేశం వచ్చేస్తుంది చాలా మందికి. ఇమేజ్ అడ్డు వస్తుంది. అందులోనూ సినిమాల్లో శిఖరంగా ఉండి, రాజకీయాల్లోనూ అంతే ఎత్తుకు ఎదిగి అద్భుతాలు సాధించిన ఎన్టీఆర్ లాంటి వాడి విషయంలో అయితే ఆ ప్రభావం మరింత ఎక్కువ ఉంటుంది. అభిమానుల ఒత్తిడో, కుటుంబ సభ్యుల ఎఫెక్టో పడి వాస్తవాలు చెప్పలేకపోవచ్చు కూడా ! ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో మాత్రం క్రిష్ నిజాయితీకి మెచ్చుకోవాలి. పై పెచ్చు బాలయ్య ఎంత స్వేచ్ఛ ఇచ్చాడు, ఎంతలా ఇమిడిపోయాడు – వాస్తవానికి ఎంత కట్టుపడ్డాడో చెప్పేందుకు ఇదే మచ్చుతునక. ఎన్టీఆర్ కి అప్పట్లో క్రిష్ణ కుమారితో ప్రత్యేక అనుబంధం ఉండేదని పుంఖానుపుంఖాలుగా పత్రికలు రాశాయ్ ఓ దశలో. సినిమా ఇండస్ట్రీలోనే కాదు అభిమానుల్లోనూ ఆ చర్చలు ఉండేవి. పైపెచ్చు ఇద్దరూ హిట్ పెయిర్. అందుకే మసాలా పండింది. బయోపిక్ లో బాలయ్య ముఖ్య ఘట్టాలను టచ్ చేశాడు. కీలకమైన పాటల్ని, ఏ సినిమా ఎందుకు తీయాలనుకున్నాడు ఎన్టీఆర్ అనే విషయాన్ని కూడా చెప్పాడు. పనిలో పనిగా కొందరు హీరోయిన్లను కూడా చూపించాడు. ఎన్టీఆర్ హిట్ కాంబినేషన్ అన్నట్టు. అందులో వరసగానే క్రిష్ణ కుమారి ప్రస్తావన కూడా వచ్చింది. భావోద్వేగం తన్నుకొచ్చే సందర్భంలో క్రిష్ లోని సున్నితత్వం ముచ్చట వేసింది చూస్తుంటే !

ఎన్టీఆక్ తనయుణ్ని కోల్పోయిన విషాదంలో ఉంటాడు. అయినా సినిమా షూటింగ్ ఆపొద్దని కంటిన్యూ చేస్తాడు. అవతల పక్కన ఆమెతో సన్నివేశం. ఈయనేదో వేదనలో ఉన్నాడని ఆమెకి అర్థం అవుతుంది. ఏమైయ్యింది అని అడగాలనుకుంటుంది గొంతులోనే మాట పూడుకుపోయింది. చెప్పలేక అడగలేక ఆగిపోయింది. ఒకే ఒక్కసారి మాత్రం చేతి మీద చెయ్యి వేసినట్టు చూపించాడు దర్శకుడు. అదే పట్టి చూపుతోంది ఎన్టీఆర్ సినిమాలో నిజాయితీనీ, క్రిష్ లోని సెన్సిబిలిటీనీ ! హ్యాట్సాఫ్.

-->