లగడపాటితో కెలుక్కున్నాడు కేసీఆర్ ఇక త్వరలో విడుదల !

సివిల్ కేసులో అర్థరాత్రి సోదాలు చేస్తారా ? అదే మాట అడిగితే ఎటాక్ చేస్తారా ? అల్లాటప్పా అయితే ఎలా ఉండేదేమో కానీ అవతల పక్క లగడపాటి. అందుకే ఎన్నికల ముందుకు తెలంగాణ ఒక్కసారిగా భగ్గుమంటోంది. సెగ రేగింది. ఏంటి లగడపాటిని కేసీఆర్ టార్గెట్ చేశాడా ? అందుకేనా దాడులు ? మరి ఇప్పుడు ఏం జరగబోతోంది ?

లగడపాటి కేవలం హింట్ ఇచ్చి వదిలేశాడు. కానీ కేసీఆర్ మాత్రం భయంతో ముందే హంట్ మొదలు పెట్టినట్టు ఉన్నాడు. చూడబోతే సీన్ అలాగే ఉంది. ఎన్నికల్లో ఎవరికి అడ్వాంటేజ్ ఉందో ఇప్పుడే చెప్పను అంటూ లగడపాటి ఢిల్లీలో చెప్పీ చెప్పకుండా ఓ లాజిక్ చెప్పేశాడు. పై పెచ్చు మెదక్ లో పోటీ చేస్తా అన్నాడు. అప్పటి పరిస్థితిని బట్టీ ఆలోచిస్తా అన్నాడు. అంటే ఏంటి అర్థం టీఆర్ఎస్ బతికి ఉంటే మెదక్ మాట ఎత్తుతాడా లగడపాటి ? ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పతనం ఖాయం కాబట్టే మెదక్ లో పోటీ మాట ఎత్తాడు అని అర్థం కావాల్సిన వాళ్లకి అర్థం అయిపోయింది. పై పెచ్చు పోలింగ్ కి ముందు సర్వే విడుదల చేసే ఆలోచనే లేదన్నాడు. కానీ ఇప్పుడు కేసీఆర్ కెలికాడు. కాంగ్రెస్ కి అనుకూలం. చంద్రబాబు అంటే పడి ఛస్తాడు కాబట్టి లగడపాటి ఏ క్షణంలో అయినా సర్వే చేసి తన కొంప ముంచుతాడు అనే భయంతోనే ముందస్తు ఎటాక్ మొదలు పెట్టాడు అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

నిజమేంటి. తెలంగాణలో లగడపాటి సర్వే చేశాడు. ఫలితాలు వెరీ క్లియర్. కూటమిదే అఢ్వాంటేజ్. కానీ అప్పటికి ఇంకా ఐదు వారాల సమయం ఉంది. సోనియా రావాలి. చంద్రబాబు తిరగాలి. కేసీఆర్ జనంలోకి వెళ్లిన కొద్దీ టీఆర్ఎస్ కి మైనస్ అవుతుంది. అవన్నీ లెక్కలోకీ తీసుకొని అప్పటి పరిస్థితిని బట్టీ రిలీజ్ చేయాలా వద్దా సర్వే అని నిర్ణయం తీసుకుంటా లగడపాటి చెప్పాడు. ఇప్పుడు వాయిస్ చూస్తుంటే మాత్రం ఛాయిస్ మారేలా ఉంది. ఏంటి ఇంత దుర్మార్గంగా చేస్తారా ? ఇదా పాలన అంటే అంటున్నాడు. అంటే కేసీఆర్ కి పిడి పడినట్టేనేమో ! ఇండియా టుడే లాంటి సర్వేలు వంద వేసుకున్నదీ ఒక్క లగడపాటి సర్వే ఈక్వల్. అందుకే కేసీఆర్ రాంగ్ బటన్ ప్రెస్ చేశాడు అంటున్నది.

-->