లగడపాటికి కేసీఆర్ ఫోన్ చేశాడా ? ఏం మాట్లాడాడు ?

కేసీఆర్ ని ఇప్పుడు వెంటాడుతున్న ఒకే ఒక్క పేరు లగడపాటి రాజగోపాల్. చంద్రబాబుని అయితే నేరుగా తిడతాడు. ఆంధ్రోళ్ల మీద ఎలాగో మింగలేక కక్కలేక అల్లాడుతున్నాడు. రాజగోపాల్ పేరు మాత్రం అలా కాదు. పైకి చెప్పలేడు. చెప్పుకోకుండా ఉండలేడు అన్నట్టు అయిపోయింది. అందుకే కేసీఆర్ టెన్షన్ రేంజి ఎలా ఉందో సన్నిహిత మంత్రి బైట పెట్టాడు. దేవుడు ప్రత్యక్షమైతే రాజగోపాల్ సర్వే రాకూడదని కోరుకుంటాడట కేసీఆర్. అందుకే లగడపాటి కూడా సూపర్ ప్లాన్ వేశాడు !

లగడపాటి సర్వే దేశంలోనే బెంచ్ మార్క్. ఇంచ్ కూడా తేడా రాకుండా పర్ఫెక్ట్ గా పట్టుకోవడం లగడపాటి స్టైల్. అందుకే తెలంగాణలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు లగడపాటిని అడిగి తెలుసుకుంటున్నాయ్ పార్టీలు, నాయకులు. శాంప్లింగ్ ఎలా తీస్తాడు, ఎలా చెబుతాడో తెలియదు కానీ అద్భుతం అనిపించేలా ఫలితం మాత్రం చూపిస్తాడు. అందుకే లగడపాటి పేరు చెబితే టీఆర్ఎస్ కి ఆటోమేటిగ్గా కాళ్లల్లో ఒణుకు వచ్చేస్తోంది. ఎందుకంటే ఇప్పటికే జనం మూడ్ వ్యతిరేకంగా ఉందని తేలిపోయింది. వంద సీట్లు అని చెప్పుకుంటుంటే కనీసం నవ్వను కూడా నవ్వడం లేదు ఎవ్వరూ. పాత జోక్ అయిపోయిందని మానేశారు. ఇలాంటి సమయంలో లగడపాటి సర్వే బైటకి వచ్చిందంటే అంతే సంగతులు అని భయపడుతున్నారు కేసీఆర్ అండ్ కో. మరి లగడపాటి ఏం చేస్తాడు ? ఇదే విషయం ఆయన వ్యూహ బృందంతో కూడా అన్నాడు. అందులో పాల్గొన్న మంత్రి బైట పెట్టాడు కేసీఆర్ భయం ఏ రేంజిలో ఉందో ! దేవుడు ప్రత్యక్షం అయితే కేసీఆర్ ఒక్కటే కోరతాడు. లగడపాటి సర్వే జనంలోకి రాకుండా చూడు అని ! అంటున్నాడు. ఓ దశలో ఫోన్ చేసి మాట్లాడదామనుకున్నాడు కానీ సరికాదేమో, చెప్పినా రాజగోపాల్ ఆగడేమో అని చేయలేదు అంటున్నారు. మరి లగడపాటి ప్లానేంటి ? ఇదే పాయింట్ ఇప్పుడు. సర్వేలు ప్రకటించొద్దు అని ఈసీ ఆంక్షలున్నాయ్. ఓకే. అంటే చెప్పకూడదు. అందుకే లగడపాటి కొత్త ప్లాన్ చేశాడు అంటున్నారు. అసలు మూడ్ ఏంటో – తనకి తెలిసిన వివరాలు ఏంటో ప్రెస్ మీట్ పెట్టి పరోక్షంగా బైటపెడతాడు అంటున్నారు.

టీఆర్ఎస్ కి పరిస్థితి ప్రతికూలంగా ఉంది. ఏ మాత్రం జనంలో సాఫ్ట్ కార్నర్ లేదు. పైగా ఆక్రోశం ఉంది. ఊహించని రీతిలో పతనం కాబోతోంది అధికార పార్టీ అని సన్నిహితులతో లగడపాటి అన్నట్టు సమాచారం. అందుకే ప్రెస్ మీట్ పెట్టి లగడపాటి మాట్లాడితే చాలు ఇక పొలిటికల్ బ్లాస్ట్ ఖాయం. మరి బ్లాస్ట్ మరో వారంలో ఉండొచ్చేమో !

-->