మోడీ బన్ గయా బచ్చా ! రాహుల్ పక్కన బాబు నిలబడ్డాక లెక్క మారింది !

చిన్న నంబర్ లోంచి పెద్ద అంకె తీసి వేయడం ఎలా ? పక్క నుంచి అప్పుతెచ్చుకోమని చెబుతారు చిన్నప్పుడు ! రాహుల్ గాంధీ అదే పని చేశాడు. చంద్రబాబు సాయం తీసుకున్నాడు. ఇప్పుడు ఇక తీసివేతగా మిలిగిపోయేది మోడీనే ! రాహుల్ గాంధీని నిలబెట్టింది చంద్రబాబు. అవును. ఢిల్లీలో లెక్క ఇలాగే మారింది. మోడీ బన్ గయా బచ్చా !

మొన్నటి వరకూ రాహుల్ బలం 3 అయితే మోడీ 5లా కనిపించాడు. డామినేట్ చేశాడు. ఇఫ్పుడు చంద్రబాబు ప్రాంతీయ పార్టీలన్నిటినీ కలిపి రాహుల్ కి దన్ను అయ్యాడు. బాబు స్ట్రెంగ్త్ 9. మాగ్జిమమ్ సింగిల్ డిజిట్. అంటే 9 ప్లస్ 3. 12 అయ్యింది రాహుల్ స్ట్రెంగ్త్. మరి 12 నుంచి 5 తీసేస్తే మిగిలేదు. 7. మోడీకి మిగిలేది ఏడుపే. ఇక బాబు రాహుల్ కాంబినేషన్ ముందు మోడీ దిగదుడుపే !

ఏజ్ లో మోడీ పెద్దోడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ. అందుకే ఆ మదం మాటల్లో కనిపించింది. పప్పు, బచ్చా అంటూ రాహుల్ గాంధీని హేళన చేశాడు మోడీ. ఇది మొన్నటి పిక్చర్. కానీ చంద్రబాబుతో కలిసి నడిచొచ్చి మీడియాను రాహుల్ అడ్రస్ చేశాక సినిమా మారింది. సుదీర్ఘ అనుభవం, కనీసం మోడీ ఎవరో ప్రపంచానికి తెలియక ముందే సీఎం అయిన ట్రాక్ట్ రికార్డ్, చంద్రబాబు విధానాలు స్టడీ చేస్తున్నామని ఇదే మోడీ చెప్పుకున్న చరిత్ర అన్నీ ఉన్నాయ్. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి 23 ఏళ్లు అయితే, మోడీ రాజకీయాల్లోకి వచ్చే అంతా కలిపి 20 ఏళ్లు కూడా కాలేదు. మరి ఇప్పుడు ఎవరి ముందు ఎవరు బచ్చా ? కేవలం బీజేపీ లాంటి ఓ నేషనల్ పార్టీని మేనేజ్ చేశాడు కాబట్టి, తప్పుడు ప్రచారం చేసి సోషల్ మీడియా మేనేజ్మెంట్ తో కుర్చీ ఎక్కితే ఎక్కిఉండొచ్చేమో ! ఏనుగు మీద కూర్చున్నంత మాత్రాన పప్పీ పహిల్వాన్ కాలేదు. బచ్చా బడా అవ్వలేడు కదా. మోడీ కూడా అంతే ! అందుకే చంద్రబాబు కలిశాక రాహుల్ చంద్రబాబు జోడీ కుంభస్థలం మీద గురి పెట్టింది.

ఈ విషయం దేశం మొత్తానికి అర్థం అయ్యింది. బాబు ఈజ్ బ్యాక్ అంటోంది అందుకే. ఈ మొత్తం ఎపిసోడ్ లో చెడ్డీ రేంజికి జారిపోయింది మోడీనే. ఎస్. మోడీ బన్ గయా బచ్చా !

-->