లోకేశ్ కి సారీ చెప్పాడా ? పవన్ ఏమన్నాడో చూశారా !

పవన్ కల్యాణ్ టీడీపీని తిట్టడం లేదు. సమ్ థింక్ ఈజ్ కుకింగ్ అంటున్న వైసీపీకి మరో షాక్ తగిలేలా ఉంది. పవన్ చాలా క్లియర్ గా చెప్పాడు. జగన్ లా తనవి సంస్కారం లేని మాటలు కాదన్నాడు. ప్రతిపక్ష నాయకుడు చంపండి, చింపండి అని పిలుపు ఇస్తున్నాడని తాను మాత్రం అలా ఇవ్వడం లేదు అంటూనే చాలా కీలకమైన విషయం ఒకటి బైటపెట్టేశాడు. అందుకే ఇప్పుడు మూడు పార్టీలూ మాట్లాడుతున్నాయ్.

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మూడ్ మారుతున్నట్టు ఉంది. పవన్ వేగంగా అడుగులు ఓ వైపు వేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఆ అడుగులు పడుతున్న వైపు ఎవరు ఉన్నారు అనేదే అసలు పాయింట్ ఇప్పుడు. రాజకీయాల్లో సంస్కారం చాలా ముఖ్యం అంటున్నాడు పవన్. మరి రాత్రి తెలిసిందో, నిన్న సాయంత్రం రియలైజ్ అయ్యాడో తెలీదు కానీ మాట అయితే మారింది. జగన్ లాగా తాను ఏదిబడితే అది మాట్లాడే స్వభావం ఉన్న నాయకుణ్ని కాదు అంటున్నాడు. అందుకే టీడీపీని సబ్జెక్ట్ వారీగా మాత్రమే వ్యతిరేకించా అంటున్నాడు. జన సేన నిర్మాణం కోసం ఫ్రేమ్ వర్క్ లో ఉన్నాను. అందుకే ఎక్కువగా రాజకీయాలు మాట్లాడలేకపోతున్నాను అంటున్నాడు. పవన్ కలిసి రావాలి అని చంద్రబాబు కామెంట్ చేసిన తర్వాత పవన్ మాట్లాడ్డం రెండోసారి. మొదటి సారేమో ముక్తసరిగా ఖండించాడు. అంటే తప్పదు కాబట్టి ఖండిస్తున్నా అన్నట్టుంది ఆ రియాక్షన్. ఇప్పుడేమో నేను టీడీపీని తిట్టలేదు ఎప్పుడూ అని సంజాయిషీ చెబుతున్నట్టుగా ఉంది. ఏంటి సంగతి ? పవన్ మెల్లగా ఓ నిర్ణయానికి వస్తున్నాడా ? ఆ సంగతి టీడీపీ ఎప్పుడో ఊహించేనేమో కానీ మాట్లాడ్డం లేదు ఏమీ. అటు వైసీపీకేమో భయం నిజమవుతున్నట్టుగా అనిపిస్తోంది ఇప్పుడు. ఎటొచ్చి కన్ ఫ్యూజన్ లో ఉన్న జనసేనే ! పవన్ ఆ గందరగోళాన్ని మరింత పెంచేశాడు ఖాయంగా ! ఎందుకంటే లోకేశ్ మీద పరోక్షంగా కామెంట్లు, ప్రత్యక్షంగా ప్రస్తావనలు తెచ్చిన పవన్ ఇప్పుడు అసలు తాను ఏమీ అనలేదు అంటున్నాడు. అంటే ఇప్పటి వరకూ అన్నవి మర్చిపొమ్మన్నట్టుగా చెబుతున్నాడు అనిపిస్తోంది వరస చూస్తుంటే !

ఇంతకీ మూడు పార్టీలూ మాట్లాడ్డం దేనికి ? జనసేనకేమో ఏం జరుగుతోందో అర్థం కావడంలేదు. అసలే కొత్త నిక్కర్లు కాబట్టి పవన్ కామెంట్లకి అర్థం ఏంటా అని మెడ రాచుకుంటున్నారు. అటు వైసీపీనేమో వాళ్లిద్దరూ ఒకటే అనే సిద్ధాంతానికి సానపడుతోంది. ఇక టీడీపీ సైలెంట్ గా ఉంది. పవన్ కల్యాణ్ చెబుతాడే, చంద్రబాబు ఎప్పుడు మాట్లాడడు. ఆయన మౌనం ప్రమాదకరం అని. అలాగే ఉంది సీన్ ఇప్పుడు !

-->