లోకేశ్ రాజీనామా ! ఇక ఫిక్స్ అయినట్టే !

లోకేశ్ రాజీనామా చేసేందుకు రెడీ అయిపోయారు. అతి త్వరలోనే నిర్ణయం. వరసగా లీడర్లు తప్పుకుంటున్న సమయంలో లోకేశ్ కూడా నిర్ణయం తీసుకోవడం ఖాయం అయిపోయింది. అఫీషియల్ గా తెలియడానికి మాత్రం కాస్త టైమ్ పడుతున్నట్టు కనిపిస్తోంది.

ఇప్పటికే సుబ్బారెడ్డి రాజీనామా చేసేశాడు. సోమిరెడ్డి రాజీనామా చేశాడు. మరో ఇద్దరు కూడా రాజీనామా చేసి తప్పుకోవడం ఖాయం అయిపోయింది. అవును. మాట్లాడుతున్నది ఎమ్మెల్సీ పదవుల గురించే ! ఏపీలో లెక్క ప్రకారం మార్చి నాటికి 13 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావాల్సి ఉంది. వీటితోపాటు ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్నవాళ్లు కూడా తప్పుకుంటున్నారు. సోమిరెడ్డి, సుబ్బారెడ్డి అలాగే చేశారు.సోమి రెడ్డి స్థానం అయితే గవర్నర్ కోటాలో ఉంది. అందుకని ఎవరికి కావాలంటే వాళ్లకి తక్షణం ఇచ్చుకునే ఛాన్సు ఉంది. ఇక లోకేశ్ తోపాటు కేబినెట్ లో ఉన్న ఒకరిద్దరు కూడా తప్పుకుంటారు అంటున్నారు. లోకేశ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మంగళగిరితోపాటు చిత్తూరు జిల్లా పేర్లు కూడా వినిపిస్తున్నా ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయమూ జరగలేదు. త్వరలోనే ఉంటుంది అంటున్నారు. ఫిబ్రవరి 16 నుంచి ప్రచారం ఆఫీషియల్ గా మొదలైపోతుంది ఎన్నికలకు అని టీడీపీ అంటోంది ముందు నుంచి. అంటే నెలాఖరు నాటికి ఇంకా గట్టిగా పది రోజుల సమయం ఉంటుంది. ఆలోగానే తేలిపోతుంది అంటున్నారు. నోటిఫికేషన్ నాటికి అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు కాబట్టి లోకేశ్ నిర్ణయం తీసుకోవడం కూడా ఖాయం అంటున్నారు.

కాకపోతే ఒక్కటే క్లారిటీ. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది తేలిన తర్వాతనే నిర్ణయం ఉంటుంది. అంటే కొంచె సమయం పడుతుంది. అందుకే ప్రత్యేకంగా చెబుతున్నది. లోకేశ్ రాజీనామా చేయబోతున్నారు అని !

-->