అల్లు అర్జున్ లోకేశ్ తో కలుస్తాడా ? ఫిక్సా ?

చూడబోతే ఫిక్స్ అయినట్టే ఉంది. ఓ పక్కన పిల్ల సేన ఉండగా టీడీపీ వైపు ఎందుకు వస్తున్నట్టు ? అందులోనూ లోకేశ్ ను కలవడం దేనికి ? హీట్ పెంచే ఈ స్టోరీ వెనక మేటరేంటో చూడండి !

తెలంగాణ రాజకీయం తెలుగు సినిమా ఇండస్ట్రీని బలంగా తాకుతోంది. మొన్నటి వరకూ టీఆర్ఎస్ నాయకుడుగా ఉన్న అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ పై భగ్గుమంటున్నారు. ఓడినా ఇబ్రహీం పట్నంలో నేను చురుగ్గా ఉన్నా. గెలిచేది నేనే. అయినా నాకెందుకు టిక్కెట్ ఇవ్వడం లేదు . ద్రోహం చేశాడు కేసీఆర్ అంటున్నాడు. పై పెచ్చు ఆల్రెడీ టీడీపీతో టచ్ లోకి వచ్చాడన్న టాక్ తెలంగాణలో వినిపిస్తోంది. ఇప్పటికే చంద్రశేఖర్ రెడ్డి లోకేశ్ తో మాట్లాడుకున్నాడని, టిక్కెట్ రావొచ్చని అంటున్నారు. కాకపోతే ఇక్కడ చిక్కేమిటి అంటే ఇబ్రహీం పట్నం నుంచి మహా కూటమిలో ఎవరు పోటీ చేస్తున్నారనేది పాయింట్. కాంగ్రెస్ కి స్ట్రాంగ్ కేండిడేట్ ఉన్నారు. అలాగే టీడీపీలో సామా ఫ్యామిలీ ఉంది. వాళ్లు ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీతోనే సెయిల్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రశేఖర్ రెడ్డి వచ్చి చేరి టిక్కెట్ సాధించే అవకాశం ఉంటుందా అన్నది పాయింట్. ఆయన అనుచరులు మాత్రం టీడీపీతో మాట్లాడుతున్నామని చెబుతున్నారు. చంద్రశేఖర్ రెడ్డి మరో అడుగు ముందు కేసి ఇంకో మాట కూడా చెప్పాడు. తనతోపాటు ప్రచారం చేసేందుకు అల్లుడు బన్నీ వస్తాడు అంటున్నాడు. చిరంజీవి కూడా తన కోసం తిరుగుతాడని చెబుతున్నాడు. అంటే ఇప్పుడు వాళ్లు చేస్తున్న ప్రచారం ప్రకారం లోకేశ్ తో బన్నీ కలవడం తిరగడం ఖాయం అనుకోవాలి.

కాకపోతే టీడీపీ వైపు నుంచి కదలిక లేదు. పెద్దగా స్పందించడం లేదు. ఎందుకంటే సిటీ ప్రాంతంలో ఇప్పటికే గట్టి పోటీ ఉంది. ఎటూ తేల్చుకోలేకపోతోంది. చంద్రబాబు కొత్తగా నిబంధన పెట్టాడు. ఎక్కడి వాళ్లు అక్కడే పోటీ చేయాలని చెప్పాడు. అందుకే జిల్లాల్లో ఉంటున్నాయ్ టీడీపీకి సీట్లు. మరి ఇబ్రహీం పట్నం కనుక కూటమిలో టీడీపీకి దక్కితే మాత్రం కాంబినేషన్ ఫిక్సే !

-->