మాగుంట ఉంటారా ? జంప్ చేస్తారా ? చంద్రబాబుతో చెప్పిన ఆ మాటకు అర్థమేంటి ?

ఏమైనా అడిగితే ఆయన కొట్టే డైలాగ్ ఒక్కటే. నేను వ్యాపారిని ‍! జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటా అని ! మరి సీఎంతో సమావేశం తర్వాత మనసు మారిందా ? అసలు లోపల ఏం జరిగింది ? ఏం మాట్లాడాడు ? మాగుంట ఉన్నట్టా ? లేనట్టా ?

ప్రకాశం జిల్లాలో మాగుంట ఫ్యాక్టర్ ఉంది అని గట్టిగా చెప్పేవాళ్లే ఎక్కువ. కొంత మంది మాత్రం ఆయన రాజకీయాల్లో అంత క్రియాశీలకంగా ఉండడు, ఎన్నికల ముందు మాత్రమే హడావుడి చేస్తారని అంటారు. పార్టీ అన్న తర్వాత అన్ని రకాల వాళ్లూ ఉంటారు కాబట్టి అన్నీ మాట్లాడాల్సింది ఇప్పుడు కాదు. ఇప్పుడు కేవలం ఆయన ఉంటారా ? లేదా అనేదే విషయం. నేను చంద్రబాబు నుంచి సాయం పొందిన వాణ్ని. చెప్పాపెట్టకుండా వెళ్లిపోయే వాణ్ని కాదు. లోతుగా చర్చించా అంటూ దండం పెట్టుకుంటూ వెళ్లిపోయాడు మాగుంట. ఇంతకీ ఏం మాట్లాడారు లోపల అని ఆరా తీస్తే చాలా సంగతులే బయట పడ్డాయ్. ఒంగోలు లోక్ సభ పరిధిలో ప్లస్సులు ఏంటి, మైనస్సులు ఏంటి అనేది చర్చించాడు. ఇక్కడ రెడ్డి డామినేషన్ ఉంది కాబట్టి వైసీపీకి అడ్వాంటేజ్ కనిపిస్తోంది. దాన్ని తగ్గించాలంటే కనిగిరి లాంటి చోట్ల త్వరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పాడు. అంటే ఏం లేదు, అక్కడ ఎప్పటి నుంచో బడా నాయకుడు ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. పాదయాత్ర చేసి ఫ్రెష్ గా సిద్ధం అయ్యాడు కూడా ! మరి చంద్రబాబు ఎందుకో ఇంకా ఎటూ చెప్పడం లేదు. అలాంటివి ముందు సెట్ చేసుకోండి. లేకపోతే ఇబ్బంది అవుతుంది.యాదవ ఓట్లు రెండు లక్షలకిపైగా ఉన్నాయ్. వైశ్యా ఓట్లు 70 వేలకిపైగా ఉన్నాయ్. కానీ రెడ్డి డామినేషన్ ను కట్టడి చేయాలంటే వ్యూహం తప్పని సరి అన్నది మాగుంట ఫీలింగ్.

అదే మాటచంద్రబాబుకి నేరుగా చెప్పారు. త్వరలో నిర్ణయం తీసుకుందామన్న మాట అటు వైపు నుంచి కూడా వచ్చింది అంటున్నారు. అంటే ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు. మాగుంట వెళ్తున్నట్టు కాదు. అలాగని ఆయన ఉండిపోతున్నట్టు కూడా అనుకోలేం. ఎందుకంటే, ఆయనే చెప్పాడుగా వ్యాపారిని అని !

-->