కేసీఆర్ మీద మమత జోకు అదిరింది ! ఒక్క మాటలో చెప్పేసింది సినిమా !

మమతా బెనర్జీ సీనియర్ పర్సనాలిటీ. ఎప్పుడూ వేళాకోళానికి మాట్లాడినట్టు కానీ తేలిగ్గా తీసుకున్నట్టుగా కానీ కనిపించరు. అలాంటి మమత కేసీఆర్ గురించి ఒకే ఒక్క మాటలో చెప్పారు. అది ఆమె పర్సెప్షన్. కానీ కేసీఆర్ గురించి తెలిసిన వాళ్లకి మాత్రం కితకితలు పెట్టించి నవ్వించే బడా జోక్ అది.

అవును. కేసీఆర్ గురించి మమతా బెనర్జీకి బాగానే తెలుసు. బీజేపీ ముసుగు వేసుకొని, ప్రత్యేక విమానంలో ఆమెను కలిసేందుకు వెళ్లాడు కేసీఆర్. ఫ్రంట్ కడతా అన్నాడు. గట్టిగా నాలుగు నెలలు కూడా కాలేదు. ఆ ఫ్రంట్ నేల నాకేసింది. మీరు బీజేపీ వైపా వ్యతిరేక కూటమిలోనా అంటే చెప్పలేకపోయాడు కేసీఆర్. అందుకే మమత అప్పట్లో లైట్ తీసుకుంది. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా చూడండి, ఆయనేదో ప్రయత్నం చేస్తున్నాడు. తాపత్రయ పడుతున్నాడు. చేయనివ్వండి అన్నదే తప్ప అంతకు మించి మాట్లాడలేదు. నిన్న చంద్రబాబుతో పెట్టిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాత్రం ఓ మాట క్లియర్ గా చెప్పింది. బీజేపీ వ్యతిరేక కూటమి ఫలితాలు ఎలా ఉంటాయో కర్ణాటక చూపించింది. అందరూ కలిసి నడవడం అవసరం. చంద్రబాబు ప్రయత్నం సూపర్బ్ అని తేల్చింది. పనిలో పనిగా మాటల్లో మాటగా కేసీఆర్ గురించి ఓ జోక్ కూడా పేల్చింది.

హి ఈజ్ ఎ నైస్ మేన్. బట్, రొంగ్ సైడ్ ఆఫ్ ద హిస్టరీ – అనేసింది. రాంగ్ సైడ్ ఆఫ్ ద హిస్టరీ అనమాట. అంటే ఎటు ఉండకూడదో అటు ఉంటాడు. ఇప్పుడు చూడండి. మోడీ కోట కూలుతోంది. కేసీఆర్ మాత్రం అటువైపు ఉన్నాడు. అందుకే ఆమె అలా అనడం. ఇంతకు ముందు కూడా అంతే. 2009లో కాంగ్రెస్ గెలుస్తుండగా అద్వానీని కలిశాడు వెళ్లి. అప్పట్లో మహా కూటమికి హ్యాండిచ్చాడు. అలాగే ఉంటాయ్ కేసీఆర్ ప్రయత్నాలు. అందుకే మమత అలా అనడం. రాంగ్ సైడ్ ఉన్నవాడు గెలవడం ఎప్పుడైనా చూశారా ?

-->