లోటస్ పాండ్ లో కూర్చొని చేస్తున్నది ఇదా ? మంగలి క్రిష్ణ కేసుతో జగన్ డొంక కదిలింది !

కడుపు నిండింది కదా అని అడుక్కోవడం మానేస్తామా చెప్పండి – అని బ్రహ్మానందం డైలాగ్ ఒకటి ఉంటుంది. జగన్ కూడా అదే టైపు. రాజకీయాల్లోకి వచ్చాం కదా అని కుటుంబ వృత్తిని మానేస్తాడా ? బెదిరింపులు ఆపేస్తాడా ? సెటిల్మెంట్లు బంద్ చేస్తాడా ? నెవ్వర్ ! మంగలి క్రిష్ణను లిఫ్ట్ చేశాక తెలిసింది ఆ సంగతి. కాకపోతే ఒక్క పాయింట్ మర్చిపోకూడదు. 2014లో విశాఖలో చేసినట్టే ఇక్కడ కూడా రాంగ్ బటన్ ప్రెస్ చేశాడు జగన్.

మంగలి క్రిష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు లిఫ్టు చేశారు. ఓ సెటిల్మెంట్ లో 8 కోట్లు డిమాండ్ చేశాడు అనేది కంప్లైంట్. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 56లో యవ్వారం ఇది. పులివెందుల బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నాం – ఏమనుకుంటాండావ్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆడియో ఉంది. పులి వెందుల ముఠా ఇక్కడే ఉంది అనే సమయానికి జగన్ కూడా హైద్రాబాద్ లోనే ఉన్నారు. క్రిష్ణ ధమ్కీ ఇచ్చిన వ్యక్తితో కొద్ది రోజుల కిందటే జగన్ కూడా మాట్లాడాడు అని పోలీసులు చెబుతున్నారు. మరి ఆధారాలు తీయాలి. రికార్డులు మ్యాచ్ చేయాలి. అంటే ఇవన్నీ ఇంటర్ లింక్డ్ అని అయితే అర్థం అయిపోతోంది. మంగలి క్రిష్ణను లిఫ్టు చేసి సర్ఫ్ వేసి ఉతుకుతున్నారు. రేపో మాపో మెరుపు వచ్చేస్తది. కానీ మురికి పోదు.

ఇక్కడ పాయింట్ ఏంటంటే, జగన్ కి ఓ అద్భుతమైన మెసేజ్ ఉంది ఇందులో ! జగన్ ను జనం ఎందుకు నమ్మడం లేదు ? జగన్ రాజకీయాలపై ఎందుకు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఉంటుంది ఎప్పుడూ ? జగన్ వస్తే మన బతుకులు ఏమైపోతాయో అనే భయం ఎందుకు ప్రబలి పోయింది ? వీటన్నిటికీ గూగుల్ సెర్చ్ చేయక్కర్లేదు. ఈ కేసు తీరుతెన్నులు చూస్తే చాలు. రాజకీయాల ముసుగులో సంపాదన మాత్రమే చూసుకుంటాడడని, రాజా రెడ్డి స్టైల్లో సెటిల్ మెంట్లు చేసుకుంటూ ఉంటాయని తేలిపోయింది. జగన్ ఒరిజినాలిటీ అదే అని రుజువు అయిపోయింది.

-->