కేసీఆర్ కోసం అబద్ధాలు చెప్పలేక సచ్చిపోతున్నాం ! మీడియా అధినేత ఓపెన్ స్టేట్ మెంట్ !

ఆయన సంచలనాలకు కేరాఫ్ ! కేసీఆర్ కి 80 సీట్లు వస్తాయని రాసింది ఆయనే ! ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కాంగ్రెస్ తో పోటాపోటీ ఉందని చెప్పిందీ ఆయనే ! ఇప్పుడు ఏకంగా – కేసీఆర్ తరపున అబద్ధాలు చెప్పలేకపోతున్నాం ! ఇలాగైతే జనం తిరగబడతాడు అని తేల్చింది కూడా ఆయనే ! డేరింగ్ అండ్ డాషింగ్ ఇమేజ్ ఉన్న ఆ మీడియా అధినేత ఓపెన్ ఇలా చెప్పాడూ అంటే మీడియా మీద ఎంత ఒత్తిడి తెస్తున్నాడు కేసీఆర్ ?

గుట్టకు రాళ్లు ఎత్తకండి అంటాడు కేసీఆర్ ! అంటే ఏంటో తెలుసా ? గుట్ట ఆంటేనే రాళ్లు పోగుబడి ఉంటయ్. మీరు మళ్లీ కొత్తగా దానికి రాళ్లు ఎత్తిపోయడం దేనికి అని ! ఇది ఓ వాడుక ! తెలంగాణ రాజకీయానికి కచ్చితంగా సరిపోద్ది ఈ మాట. ఆల్రెడీ బలం ఉన్న పార్టీకీ, గెలిచే పార్టీకీ పెద్దగా పక్క వాయిద్యాలు అక్కర్లేదు. అందుకే కాంగ్రెస్ టీడీపీలు నింపాదిగా ముందుకు వెళుతున్నాయ్. ఏ మీడియా హౌస్ సపోర్ట్ చేసినా, చేయకపోయినా పెద్దగా పర్వాలేదన్నట్టుగా ఉన్నాయ్. ఎందుకంటే జనంలో ఉన్నాం చాలు. గెలుస్తమని దానర్థం. కానీ కేసీఆర్ కి అట్లా నడవడం లేదు. కేసీఆర్ కి జనంలో దమ్ములేదు. జనం దేకుతలేరు. పట్టించుకోవడం లేదు. టీఆర్ఎస్ గ్రాఫ్ నేలబారుగా పడుకుంది. అందుకే మీడియా మీద నిర్బంధాలు, ఆంక్షలు పెంచాడు. నిజానికి తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒత్తిడి ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఓడిపోయే పరిస్థితిలో పడేసరికి ఇంకా పెరిగింది. మీడియా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆఖరికి ఆయన బినామీ కాంట్రాక్టర్ కొన్న రెండు ఛానెళ్లు కూడా అల్లాడిపోతున్నాయ్ టీఆర్ఎస్ డప్పు కొట్టలేక. కానీ పైకి ఎవ్వరూ చెప్పడం లేదు. ఆయన మాత్రం నేరుగా, ఓపెన్ గా బైటపడిపోయాడు. ప్రతీ శనివారం వచ్చే ఆయన కామెంట్లో తేల్చేశాడు. తెలంగాణలో మీడియాపై ఒత్తిడి ఉందని, అందుకే సోషల్ మీడియా జనం అభిప్రాయాలను నిక్కచ్చిగా బైట పెడుతోందని రాసేశాడు.

అంటే ఏంటి అర్థం ? సోషల్ మీడియాలో కేసీఆర్ మీద టీఆర్ఎస్ మీద ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల మీద జనం తిరగబడుతున్న దృశ్యాలు, తిట్లూ బూతులు అన్నీ తిరుగుతున్నాయ్. అవన్నీ నిజం. వాస్తవానికి అవన్నీ పేపర్లలో టీవీల్లో రావాలి. కానీ చూపించే పరిస్థితి లేదు. కేసీఆర్ చూపించనివ్వడు. అందుకే సోషల్ మీడియా చూపిస్తోంది. ఇదే వాస్తవం అని రాశాడు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కేసీఆర్ కి నష్టం లేదు కానీ మీడియానే మట్టికొట్టుకుపోతుందని కూడా తేల్చాడు. హ్యాట్సాఫ్. వాస్తవం చెప్పినందుకు. బహుశా వచ్చేవారం – 80 సీట్లు వస్తాయ్, కూటమికి అని రాయాల్సి వస్తుందేమో మరి ! నిజం చెప్పడం ఇదేగా మరి !

-->