ఆయన భార్య కోసం ఆయన జంప్ చేస్తాడా ? మీటింగులో చంద్రబాబు ఏం చెప్పాడు ?

ఆ ఎంపీ కూడా వెళ్లి పోతాడా ? ఇప్పటి వరకూ టీడీపీ ఎంపీలకి ఆయన పార్లమెంటులో పెద్ద దిక్కుగా ఉన్నాడు. ఇప్పుడు అలవి మాలిన డిమాండ్ పెట్టాడు చంద్రబాబు ముందు. ఆయన ఎలాగూ అది తీర్చడు. అంటే వెళ్లిపోయినట్టేనా ? ఈస్ట్ గోదావరిలో ఏం జరుగుతోంది ?

ఇది మెట్ట మీద పంచాయతీ. తూర్పు గోదావరిలో ముందు నుంచి రెండు వర్గాలు ఉన్నాయ్. ఒకటి నరసింహం వర్గం. రెండోది జ్యోతుల వర్గం. మొన్నటి వరకూ వేర్వురు పార్టీలు కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. అయినా నరసింహం వెనక్కి తగ్గడం లేదు. తన భార్య కోసం జగ్గం పేట సీటు అడుగుతున్నారు. జగ్గం పేట జ్యోతుల సిట్టింగు. చూస్తూ చూస్తూ ఆయన సీటు ఈమెకి ఇవ్వడం అయ్యేపని కాదు. అయినా పంచాయతీ సాగుతోంది. మరి చంద్రబాబు చెప్పి బుజ్జగించి, ఒప్పించి మెప్పిస్తాడేమో చూడాలి. అటు పక్కన వైసీపీలో మాత్రం హడావుడి మొదలైపోయింది. రెండు చోట్లా మాకు అభ్యర్థులు దొరికేశారు అంటోంది ఆ పార్టీ. ఎందుకంటే జ్యోతుల వచ్చేశాక జగ్గంపేటలో వైసీపీ దిక్కులేనిది అయిపోయింది. గెలవడం తర్వాత ముందు నరసింహం కుటుంబం వస్తే తన పార్టీకి అభ్యర్థి దొరికినట్టే అనుకుంటున్నారు జగన్ అండ్ కో. అటు కాకినాడలో కూడా జగన్ పార్టీకి ఎంపీ ఆభ్యర్థి లేడు. ఆల్రెడీ ఉన్న నాయకుడు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధపడితే, టీఆర్ఎస్ తో థమ్కీ ఇప్పించి, వార్నింగ్ ఇప్పించి ఆపారు. ఇప్పుడు ఇక ఆ అవసరం లేదు అనే ఫీలింగ్ కనిపిస్తోంది వాళ్లలో !

మొత్తానికి కుటుంబ పంచాయతీ చంద్రబాబు ఎలా తీరుస్తాడో చూడాలి. ఎందుకంటే తోట నరసింహం నెమ్మదస్తుడు. పార్టీ కోసం నిలబడ్డాడు ఇప్పటి వరకూ అనే పేరుంది. మరి ఇప్పుడు అన్ని వైపుల నుంచి గుంజితే ఆయన మాత్రం ఏం చేస్తాడు అనుకోవాలా ? లేదంటే నిలబడతాడా పార్టీ కోసం ! తేలిపోతుంది త్వరలో !

-->