మోడీ లోకేశ్ మీద ఎందుకు గురి పెట్టాడు ? ఢిల్లీ స్థాయిలో గురిపెడితే ఏపీ లెవెల్లో పడతాడా ?

సోనియా పదేళ్లలో చేయలేనిది మోడీ నాలుగేళ్లలో చేశాడు. రాహుల్ ని నాయకుణ్ని చేయడం ! ఏపీకి కేంద్రం నాలుగేళ్లలో చేయనిది చంద్రబాబు ఏడాదిలో సాధిస్తున్నాడు. అవును. కాంగ్రెస్ తో కూటమి. ప్రత్యేక హోదా ! అందుకే మోడీ కళ్లు చింత నిప్పులు అవుతున్నాయ్. చంద్రబాబుని ఏం చేయలేక ఇక లోకేశ్ మీద పడ్డాడు చూడండి.

అసలు ప్రత్యర్థిని నేరుగా కొట్టలేనప్పుడు ఆయువు పట్టు మీద గురిపెట్టాలన్నది యుద్ధ నీతి. చంద్రబాబు విషయంలో మోడీ అదే చేస్తున్నాడు. బాబు ఢిల్లీ స్థాయిలో బలపడుతుంటే ఏపీ స్థాయిలో గురి పెట్టే ప్రయత్నమా ఇది అసలు ఎందుకు లోకేశ్ మాటెత్తాడు మోడీ. ఇప్పుడు పిక్చర్ క్లారిటీ వచ్చేసింది. జగన్ అయినా కాస్త మొరటు రాజకీయం చేస్తాడు. నా రేంజి చంద్రబాబు అని చెప్పుకోవాలనుకుంటాడు. చాలా వరకూ బాబునే టార్గెట్ చేస్తాడు. అది ఓకే. ఆయన సిలబస్ అది. పవన్ మాత్రం ఎప్పుడూ లోకేశ్ మీదే పడతాడు. ముందు నుంచి టీడీపీ అనేది కూడా అదే. ఇదంతా వ్యూహాత్మకం. బీజేపీ ప్లానింగ్. అందుకే పవన్ అలా మాట్లాడతాడు అనేది. ఇప్పుడు మోడీ సాక్ష్యం చెప్పేశాడు. అవును. టీడీపీ అంటున్నది నిజం అని నిరూపించేశాడు. ఎందుకంటే మోడీ కూడా అలాగే మాట్లాడాడు. కాదు కాదు అదే మాట్లాడాడు. అసలు చంద్రబాబు ఢిల్లీ కూటమే లోకేశ్ ని రాజకీయంగా బలపరిచేందుకు అనేశాడు. వారసుడి కోసం ఆయన తాపత్రయ పడుతున్నాడు అని అర్థం వచ్చేలా మాట్లాడాడు. చంద్రబాబు రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఇది మోడీ ఫస్ట్ రియాక్షన్. అందులోనే లోకేశ్ ప్రస్తావన వచ్చిందంటే కుదుపు ఏ స్థాయిలో ఉన్నట్టు ?

అది వారసుల కూటమి అన్నాడు. రాహుల్ గాంధీ విషయంలో వారసత్వం అని మోడీ ముందు నుంచి అంటాడు. ఇలాగే లోకేశ్ విషయంలో కూడా అన్నాడు. లోకేశ్ ని ఏపీలో కూర్చోబెట్టి బాబు ఢిల్లీ వచ్చే ఎత్తుగడ అంటున్నాడు. అంటే బాబు ఢిల్లీ వస్తాడు. కుదుపు తాడు అని ఒప్పుకున్నట్టే కదా ! ఇంకోమాట. పైన చెప్పిన యుద్ధ నీతిలో నీతి అనే మాట మోడీకి సూట్ కాదనుకుంటే అది మాత్రం తీసేసి చదువుకోండి. మీనింగ్ ఏం మారదు.

-->