ప్రచారానికి రావొద్దని మోడీకి దండం పెట్టాడు ! ఇక మార్నింగ్ వాక్, యోగా చేసుకోమని జోక్ పేల్చారు !

రుచి తెలిసే ముందే ముక్కుకి వాసన తగలడం అంటే ఇదే ! మోడీ ప్రచారానికి వస్తానంటే వద్దు అనేశాడు. మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మార్నింగ్ వాక్, యోగా చేసుకోండని అంటూ ఆయన వర్గం అయితే మరో అడుగు ముందుకేసి జోకులేస్తోంది. అంటే మోడీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో సొంత పార్టీకి తెలిసిపోయిందా ?

బీజేపీ అంటే నేనే అంటూ మోడీ ఊదిన బుడగ బద్దలైపోయింది ఐదేళ్లలనే ! బీజేపీ కన్నా మోడీ బొమ్మ పెద్దదిగా ఉండేది నిన్న మొన్నటి వరకూ ! పాపం ఆ డేస్ అయిపోయినట్టుగా ఉన్నాయ్. ఐదేళ్లలోనే బండి బోర్ కి వచ్చేసింది. అందుకే ఏకంగా ఆ ముఖ్యమంత్రి మోడీకి దండం పెట్టేశాడు. మీరు రావొద్దు అనేశాడు. పైగా మధ్యప్రదేశ్ లో ఎక్కడా బీజేపీ పోస్టర్లలో మోడీ బొమ్మ వెదికి చూస్తే తప్ప కనిపించడం లేదు. అంతా కమలం గుర్తు, శివరాజ్ సింగ్ చౌహాన్ చుట్టూనే తిరుగుతోంది. మామూలుగా అయితే మోడీ పాతిక ర్యాలీలు తీసే మోడీ – ఇప్పుడు మధ్యప్రదేశ్ లో పట్టుమని పది కూడా చేయడం లేదు. పైపెచ్చు- శివరాజ్ సింగ్ ఎక్కడ టెన్షన్ పెడతాడో అని హడలిపోతోంది మోడీ వర్గం. ఎందుకంటే శివరాజ్ గెలిచినా టెన్షనే. ఓడిపోయినా కూడా టెన్షనే మోడీ వర్గానికి. మోడీకి గట్టి పోటీ, ప్రొజెక్ట్ చేయాల్సిన ఫేస్ అనుకుంటున్నవాళ్లలో శివరాజ్ ముందున్నాడు. ముందు నుంచి మోడీ వర్గం ఆయన్ని వ్యతిరేకించింది అందుకే ! ఇప్పుడు గెలిచాడు అనుకోండి తీసుకొచ్చి నెత్తిన పెడతాడు. ఓడిపోయాడు అనుకోండి – ఎలాగూ ఖాళీగానే ఉన్నాడుగా అని పట్టుకొస్తారు ఢిల్లీకి ! రెండోది జరగడమే ఖాయం అనిపిస్తోంది మధ్యప్రదేశ్ ట్రెండ్ చూస్తే. అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నారు మరి !

అందుకే మధ్యప్రదేశ్ ని తల్చుకుంటేనే మోడీకి అర ఎకరం తడిసిపోతోంది. అటు ప్రచాానికి రానివ్వడు. ఇటు ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే సింగపూర్లు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాడు. ఆఖరికి తెలంగాణలో కూడా వద్దు బాబోయ్ అని మోడీ దండం పెట్టాడు అంటే మోడీ లెగ్గు మహిమ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక !

-->