మౌన దీక్షలో స్పీచ్ లా ? వెజ్ బిర్యానీ విత్ చికెన్ అన్నట్టుంది వదినె !

ఎఫ్ఎం రేడియోలో డాన్సు ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టుగా ఉంటాయ్ లక్ష్మీ పార్వతి రాజకీయాలు ! చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మౌన దీక్ష చేశారు. పనిలో పనిగా టీవీ ఛానెళ్లకి ఫేస్ టు ఫేస్ లు కూడా ఇచ్చారు ! అదేం దీక్ష ! చింతకాయ్. లక్ష్మీ పార్వతి చెప్పే కబుర్లు ఎంత నిజమో దీక్ష పోరాటం కూడా అంతే నిజం అని అక్కడితో క్లారిటీ వచ్చేసింది. అయినా ఇలాంటోళ్లని ఇంతటితో వదలకూడదు అందుకే ఉతుకుడు !

వదినె, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో నువ్వు పోరాటాలు చేస్తా అన్నావ్. లేఖలు రాసి, వినతి పత్రాలు పట్టుకొని తిరిగావ్ గుర్తుందా ? అది ఏ పార్టీ చుట్టూ ? కాంగ్రెస్ కాదా ? పార్టీ పెట్టి చంద్రబాబును పొడుస్తా అంటూ కొన్ని నెలలు హడావుడి చేశావ్. అప్పుడు నీకు సాయం చేసింది ఎవరు ? కాంగ్రెస్ కాదా ? వైఎస్ మహానుభావుడు అంటూ మోకరిల్లావ్. మెయింటెన్స్ కి కావాలంటూ డబ్బులు పట్టుకెళ్లావ్. ఆయనదే పార్టీ ? ఎలుక తోక గుర్తు పార్టీ కాదుగా ! కాంగ్రెస్సేగా ? ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నావ్ ? ఎవడి కోసం మాట్లాడుతున్నావ్ ? ఆడి పరిస్థితి ఏంటి ? పద్ధతేంటి ? జెండా ఏంటి ? అజెండా ఏంటి ? అదేమన్నా ఎన్టీఆర్ పెట్టుకొని వదిలేసిన విభూది నుంచి పుట్టిన పార్టీనా ? చెప్పు వదినె ! అయినా నువ్వు కూడా నీతులు చెప్పడానికి బయర్దేరిపోయావంటే – ఉమ్మెత్త కాయ వచ్చి దానిమ్మ కాయను వెక్కిరించినట్టుగా ఉంది. నీకు ఏపీ అంటో తెలియదు. ఏపీ విడిపోయాక ఎన్ని అవస్థలు పడుతోందో, మోడీ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో అర్థమే కాదు. అసలు నీది ఆ రేంజి కానే కాదు. కానప్పుడు పక్క వాయిద్యాలు వాయిస్తూ ఊరుకో వదినె ! నువ్ ఏడిచి పెడబొబ్బలు పెడదామంటే కోడికత్తి గాడు కనీసం దీక్షలు కూడా చేయకపోయె. నువ్ మాత్రం ఏం చేస్తావ్ లే !

అందుకే మౌన దీక్షలూ, మట్టిగడ్డలు అంటూ స్పీచులిస్తున్నావ్. ఉపవాసం అంటూ డజను చక్రకేళీలు తినే భక్తురాల్లాగా ఉన్నావ్. మౌన దీక్ష అంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నావ్. వచ్చిన తిట్లన్నీ తిడుతున్నావ్. నీకు మౌన దీక్ష అనే మాటకి అర్థం తెలియదు. నిన్ను పోషిస్తున్నోడికి అసలు అధికారం మీద యావ తప్ప, ఆకూ పోకకి తేడా తెలీదు. నీలాంటోళ్లంతా మాట్లాడబట్టే పెట్రోల్ డీజిల్ రేట్లు ఏకమయ్యాయ్. లంచ్ టైమ్ అయ్యింది బైయల్దేరు వదినె !

-->