టీడీపీ అభ్యర్థి తరపున కొడాలి ప్రచారం ! చంద్రబాబు దెబ్బ కొట్టేశాడన్న జగన్ !

ఈ పెళ్లిలో పెళ్లి కొడుకు పక్కన పెళ్లిలో భోజనానికి వెళితే ఎలా ఉంటది ? ఏమనాలి అసలు ? జగన్ కి కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. పార్టీ ఎమ్మెల్యే నేరుగా వచ్చి, నేను టీడీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్తున్నా ఏం అనుకోబాకండి అనేశాడు. అచ్చమైన క్రిష్ణా జిల్లా భాషలో ! చంద్రబాబు స్కెచ్ ఇలాగే ఉంటదంటూ తలపట్టుకున్నాడు జగన్ !

అవును. కూకట్ పల్లి సంగతే ! అవును. కొడాలి నాని గురించే ! కొడాలి యవ్వారం ముందు నుంచి పెడసరం. టీడీపీ అంటే పడదు, చంద్రబాబు అంటే గిట్టదు కానీ హరిక్రిష్ణతో జూనియర్ తో మాత్రం అంటకాగుతాడు. వీళ్లు కూడా వ్యక్తిగతంగా రిలేషన్ బాగా మెయింటైన్ చేస్తారు. మొన్న హరన్న చనిపోయినప్పుడు కూడా కొడాలి దగ్గరే ఉన్నాడు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. పర్సనల్ రిలేషన్ కంటిన్యూ చేశాడు. అక్కడితో అయిపోలేదు. అమ్మాయ్ పోటీ చేస్తోంది. అన్న కూతురు. మనం చూసుకోకపోతే ఎలా అంటూ తైక్కుమంటూ రెడీ అవుతున్నాడు. కూకట్ పల్లిలో ప్రచారం చేస్తా అన్నాడు. వార్నీ కంగారు కూల, జగన్ ఏమంటాడో కనుక్కో అంటూ పక్కనోళ్లు చెబితే తప్ప ఎక్కలేదు చెవికి. సరే అంటూ జగన్ కి ఫోన్ చేశాడు. నేను సుహాసిని తరపున ప్రచారం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఏం మాట్లాడాలో తెలియలేదు జగన్ కి. కొడాలి గురించి తెలుసు. అలాగని అవుననలేడు. అంటే రాజకీయంగా దెబ్బ పడిపోద్ది. కాదు అని చెప్పినా కొడాలి ఆగుతాడని గ్యారెంటీ లేదు. అందుకే ఏం చెప్పాలో పాలుపోక మళ్లీ మాట్లాడతా నానీ అన్నా అని చెప్పాడు. ఆ క్షణానికి తప్పించుకున్నాడు. కానీ అంత ఈజీ కాదు. కొడాలి వదిలి పెట్టడు. నిజానికి కొడాలి కూకట్ పల్లిలో తిరగాలి అనుకుంటున్నాడు అమ్మాయికి మంచి మెజారిటీ రావాలి అని కోరుకుంటున్నట్టు చెబుతున్నాడు.

ఒక వేళ వస్తే కనుక జగన్ ఏం చేస్తాడో చూడాలి. ఏం చేయలేడేమో కూడా ! అందుకే తల పట్టుకుంటున్నాడు. ఇదంతా చంద్రబాబు స్కెచ్. ఇలాగే ఉంటాయ్ చంద్రబాబు నిర్ణయాలు ఇరికించాడు నన్ను అంటున్నాడు. వార్నీ ఆలోచిస్తే అనిపిస్తోంది – ఒక్క నిర్ణయంతో చంద్రబాబు ఇందరిని కొట్టాడా అని ! మరి మధ్యే మార్గంగా, మీటింగులు పెట్టుకొని పనిచేసుకో, బహిరంగ ప్రచారం మాత్రం వద్దులే అని చెప్పి పంపుతాడేమో చూడాలి.

-->