నానీని తిట్టాలా ? పొగడాలా ? ఇలా చేసినందుకు ఏం చేయాలి ?

ఇష్టపడ్డారంటే కష్టమొచ్చినా వదలరు. ఇది బెజవాడోళ్ల క్వాలిటీ ! నష్టపడ్డానికి కూడా సిద్ధపడతారు. నానీ అలాంటోడే ! అదే చేస్తున్నాడు. మరి టీడీపీలో కూడా కొంత మంది నానీ మీద ఎందుకు పడిపోతున్నారు ? అసలు నానీని ఏం చేయాలి ? అన్నట్టు, హర్టింగ్ గా అనిపించినా సరే – అది క్వాలిటీనే !  కేశినేని నానీకి ముందు నుంచే స్టేచర్ ఉంది. పాపులారిటీ పార్టీ వల్ల వచ్చింది. బీ క్లియర్. అందుకే నానీ పార్టీకి సలాం కొడుతున్నట్టు కనిపించడు. మెథడాలజీని నమ్ముతాడు. అర్థం కాలేదా ? మళ్లీ చెబుదాం చూడండి. నానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు తప్పితే పార్టీ కోసం ముసుగు వేసి లొసుగులు కప్పిపెట్టాలని చూడడు. పార్టీ ఒకవేళ డిఫర్ అవుతుందని తెలిసనా, చంద్రబాబు హర్ట్ అవుతాడు అని అనుకున్నా కూడా ఆపడు. కానీవండి !

ఇలాంటోడు కూడా కచ్చితంగా కావాలి. అందరూ చప్పట్లు కొట్టేవాళ్లే అయితే మరి లోపాల్ని ఎత్తి చూపేవాళ్లు, లాజిక్కును తట్టి లేపేవాళ్లు ఎవరుంటారు ! ఈ విషయాన్ని మర్చిపోయి కొందరు నానా రకాలుగా మాట్లాడుతున్నారు. షో మాస్టర్లు ఎక్కువ అయిపోయారు అని నాని పోస్టు పెడితే – నువ్ ఏం చేశావ్ అంటున్నారు. అబ్బాయ్ నీకు వైరస్ ఎటాక్ అయ్యిందిరా సీజన్ వల్ల అని చెబితే, నువ్ ఆపకుండా ఏం పీకుతున్నావ్ అనకూడదు డాక్టర్ ని ! వినాలి. ఆ వైరస్ ని మిటిగేట్ చేయడానికి ఏం చేయాలో, ఏం వాడాలో, ఏం మందు బిళ్ల వేసుకోవాలో వేసుకోవాలి. అంతేగానీ, డాక్టర్ మీద పగ పట్టకూడదు. వాడు చెప్పింది నీ మంచి కోసమే. ఈ కోణంలో చూస్తే నాని లాంటి వాళ్లు డైగ్నోస్ చేసే డాక్టర్ల లాంటి వాళ్లే ! తప్పదు. తట్టుకోవాలి నానీ మేనిప్యులేటర్ కాదు. జస్ట్ బెజవాడోడు అంతే ! మాట తొక్కేయడం, మనసులో ఒకటి పెట్టుకొని ముఖమ్మీద నవ్వు నటించడం రాదు. అందుకే అంత మంది ఉండగా – దేశం అంతా చూస్తుండుగా మోడీని ఎదురు పెట్టుకొని మరీ దులిపేశాడు. నీ అంత డ్రామా ఆర్టిస్టు ఎవడూ లేడు అన్నాడు. ఇలా అనడానికి ఎన్ని గుండెలు కావాలి ! ఎంత దమ్ము ఉండాలి ! ఆ సత్తా నానీకి బెజవాడ ఇచ్చి పంపించింది. దాన్ని ఒప్పుకోవాలి మనం. మోడీ డ్రామా అర్టిస్టు అని దేశం మొత్తం అనే రోజు, బీజేపీకి లెక్క అఫ్పగించే రోజు కచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇవాళ కాకపోతే రేపు. అప్పుడు చూడండి – అందరికంటే ఆ మాట ముందు చెప్పిన నోస్ట్రడామస్ నానీనే అవుతాడు. బహుశా మోడీకి కూడా ఇప్పటికే నాని మనసులో గుర్తుండే ఉంటాడు. ఎందుకంటే ఆ మాట మోడీని ఎవరు నేరుగా అని ఉండరు కదా !

సరే మరి ఉన్నది ఉన్నట్టు మాట్లాడి నిక్కచ్చిగా ఉంటే నానీ లాంటి వాణ్ని యాక్సెప్ట్ చేయాలి. వీలైతే చీర్ చేయాలి. వీలు కాకపోతే విని ఊరుకొని, మనసులో పెట్టుకొని మంచిగా మసులుకోవాలి. అంతే కానీ తప్పు ఎత్తి చూపితే టార్గెట్ చేసినట్టు మాట్లాడ్డం అనేది అసహనానికి గుర్తు. ఈ అసహనం ఈ మధ్య టీడీపీలోనే ఎక్కువ అవుతోంది. తగ్గించుకుంటే మంచిది.

-->