బాబు రాహుల్ కలిసి రోడ్ షో చేస్తే ఇంత ప్రభావం ఉంటుందా ? నేషనల్ మీడియా రిపోర్ట్ చూడండి !

కాంబినేషన్ బాహుబలే ! అనుమానం లేదు వాళ్లిద్దరూ కలిస్తే బ్లాక్ బస్టర్ ఖాయమే ‍! ఢిల్లీలో రాజకీయం మారడానికి ఇదే తొలి అడుగు అవుతుంది అంటోంది నేషనల్ మీడియా. ఇక రోడ్ షో తేదీ ఖరారు కాలేదు. తెలంగాణలో దిగుతా అని చెప్పాడు కానీ ఎప్పుడు దిగాతాడో చెప్పనే లేదు చంద్రబాబు. అప్పుడే ఇంతలా ఎందుకు మారింది సీన్ ? నేషనల్ మీడియా టోన్ ఎందుకు మారింది ?

నిన్న మొన్నటి వరకూ రాహుల్ గాంధీ వైపు దేకినోడు లేడు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టినా పాజిటివ్ గా మాట్లాడిన నేషనల్ మీడియా లేదు. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు వేసిన ఒక్క అడుగుతో ఢిల్లీ ఉలిక్కి పడుతోంది. ఏకంగా బాబు రాహుల్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అంటోంది నేషనల్ మీడియా ! ఎందుకని ? ఏం మారింది ? ఇదే ప్రశ్నకి సమాధానం తెలిస్తే ఢిల్లీ ఫ్యూచర్ అర్థం అయిపోతుంది. గాలి ఎటు మారుతోందో – ఎలా వీస్తోందో ఆల్రెడీ పసి గట్టింది కాబట్టే నేషనల్ మీడియా ఇప్పుడు గొంతు సవరించుకుంది. పైపెచ్చు పెయిడ్ సర్వేలు వేసే ఛాన్సు లేదు. నిషేధం అమల్లోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కొత్తగా దక్కే ప్యాకేజీలూ లేవు. అన్నిటికీ మించి ప్రభావం కళ్ల ముందు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు బాబు రాహుల్ కాంబిషన్ రాత మార్చబోతోందని, హైద్రాబాద్ లో పడే అడుగు ఢిల్లీ రాత మారుస్తుందని చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నాలుగు పెద్ద రాష్ట్రాల్లో అడ్వాంటేజ్ కాంగ్రెస్ కే ఉంది. మూడు రాష్ట్రాల్లో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క ఛత్తీస్ గఢ్ లో అటూ ఇటుగా ఉన్నా సంకీర్ణం వస్తే కాంగ్రెస్ వైపు మళ్లేందుకే జోగి సిద్ధపడొచ్చు. అంటే కాంగ్రెస్ స్కోర్ 4-0 అనమాటే. అందుకే ఇప్పుడు జాతీయ మీడియా మాట మారుస్తోంది.

హైద్రాబాద్ లో బాబు రాహుల్ రోడ్ షో రాజకీయాన్ని మార్చబోతున్న ఫినామినల్ అడుగు అంటోంది. బ్లాక్ బస్టర్ పొలిటికల్ బిగినింగ్ అంటోంది. తిరిగేది తెలంగాణలో అయినా ప్రభావం మాత్రం మిగతా మూడు రాష్ట్రాల్లో కూడా ఉంటుంది అంటోంది. కాంగ్రెస్ బలపడుతుందని, వచ్చేది కాంగ్రెస్సే అని భరోసా ఇచ్చేందుకు జాతీయ స్థాయిలో ఆలోచన మార్చేందుకు ఈ ర్యాలీ స్టార్టింగ్ పాయింట్ అంటోంది. అంటే ఇప్పుడు రాజకీయాన్ని మార్చబోతున్నది చంద్రబాబు. మారబోతున్నది ఢిల్లీ ముఖ చిత్రం. అంతే !

-->