మమత ప్రకటన చేస్తే చంద్రబాబే బాహుబలి ! నేషనల్ మీడియా సంచలన కథనం !

చంద్రబాబు మళ్లీ ఇన్నాళ్లకి ఢిల్లీ డార్లింగ్ అయిపోయాడు. గాలి ఎటు మళ్లుతోందో తెలుసు కాబట్టి ఢిల్లీ మీడియా గొడుగు తిప్పేస్తోంది. చంద్రబాబు ది లీడర్ అంటోంది. ఇప్పుడు కోల్ కతాలో దిగక ముందే ఫలితంపై ఊర్రూతలూగించే అంచనా వేసింది. మమత ప్రకటన చేస్తే చంద్రబాబే బాహుబలి అని రాసేసింది.

ఎందుకని ? కాస్త వెనక్కి వెళ్లి చూద్దాం. చంద్రబాబు కాంగ్రెస్ వైపు కదులుతున్నారు అనగానే ఇండియా టుడే రాజ్ దీప్ సర్దేశాయ్ ఓ ఆర్టికల్ రాశాడు. నెవర్ లెట్ ఆఫ్ ఎ నేత అని పెట్టాడు హెడ్డింగ్. చంద్రబాబును తీసిపారేయలేం. సంచలనాలకు ఆయన కేరాఫ్ అని రాశాడు. అప్పటికి రాహుల్ తో మీటింగ్ గానీ తెలంగాణ కూటమి కానీ కాలేదు. బాబు కేవలం తొలి సంకేతాలు మాత్రమే ఇచ్చాడు. అది ఎఫెక్ట్ అంటే. ఇదే సర్దేశాయ్ చంద్రబాబును విమర్శించేందుకు ఎగబడ్డాడు. రాష్ట్ర విభజనలోనూ బాబు ధోరణిని తప్పు పట్టి, అసలు ఏపీ అంటే ఎన్ని జిల్లాలో, ఎక్కడున్నాయో తెలియక పోయినా తెగ రాశాడు. ఇప్పుడు ఢిల్లీ అలా కాదు. సర్దేశాయ్ కి తెలుసు. ఎందుకంటే మోడీ కోట కూలుతుంటే, ఇటుకలు రాలి పడటం ఇలాంటి వాళ్లంతా చూస్తున్నారు మరి.

కోల్ కతా టూర్ మీద కూడా అంచనాలు అందుకే. చంద్రబాబు ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేశాడు. అందరినీ కలిపేశాడు. ఆఖరికి మాయావతి కూడా కాంగ్రెస్ తో కలుస్తాం అని చెప్పింది. ఈ నాల్గు రాష్ట్రాల ఎన్నికల తర్వాత. ఇక మిగిలిన ప్రభావవంతమైన పార్టీ తృణమూల్ మాత్రమే. మమత ముందు నుంచి చంద్రబాబు ఫ్యాన్. మోడీ తిరగబడినప్పుడు స్వాగించిన తొలి నేత. బాబు చేసే ప్రతి ప్రకటననూ జాతీయ స్థాయిలో వినిపించే అంబాసిడర్ కూడా ! నిన్నమొన్న సీబీఐ విషయంలో చేసింది కూడా అదే. అలాంటి మమత కనుక చంద్రబాబు ఎలా చెబితే అలా అందీ అంటే చాలు. బాబు ప్రయత్నాల్ని స్వాగతిస్తున్నాం. మేం మాట్లాడుకొని ఓ తాటిమీదకొస్తాం అంటే చాలు. చంద్రబాబు దేశ రాజకీయాల్లో అంత్యత బలవంతుడు అవుతాడు. డిసెంబల్ 11న మోడీ పతనానికి ముందే బాబు మళ్లీ ఢిల్లీ డార్లింగ్ అయిపోతాడు. మోడీ కన్నా ఎందుకు పవర్ ఫుల్ ? మోడీని దించుతాడు కాబట్టి ! కాంగ్రెస్ కన్నా ఎందుకు ఎఫెక్టివ్ ? రాహుల్ అన్నీ చంద్రబాబే కాబట్టి ! అదే ఈక్వేషన్.

-->