దీపిక రణవీర్ పెళ్లి ఇక్కడే జరిగేదేమో ! అమరావతి రేస్ చూసి చంద్రబాబుతో ఓ ఎన్నారై చెప్పిన మాట !

గడ్డం గీసుకునే రేజర్ యాడ్ సముద్రం అలల మీద తీయడం ఎందుకు ? అద్దం ముందు చూపిస్తే చాలుగా ! సత్తా ఉన్నోడు సాహసంలోనే కాదు స్టైల్ లోనూ కాంప్రమైజ్ కాడు అని చెప్పడానికి ! అమరావతి బ్రాండింగ్ లో చంద్రబాబు ఫార్ములా కూడా అదే ! అందుకే ఎన్నారై కామెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ఏపీ అవుతోంది.

సబ్బు అయితే రుద్దుకొని చూపిస్తారు హీరోయిన్లో, అందగత్తెలో ! బైక్ అయితే డ్రైవ్ చేసి సైలెన్సర్ సౌండ్ రైజ్ చేసి టెంప్ట్ చేస్తారు. కార్ అయితే కొండలెక్కించి పక్కా సాలిడ్ అంటారు ! ఇవన్నీ ప్రమోషన్ స్ట్రాటజీస్. మరి ఓ సిటీని ప్రమోట్ చేయాలంటే ఏం చేయాలి ? ఎక్కబడితే అక్కడికి తీసుకెళ్లి చూపించలేం కదా ! మా అమరావతికి రండి చూడండి అని అడగలేం కదా అందరినీ ! ఇంకా నిర్మాణంలోనే ఉంది, మోడీ మనకి కనీసం నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా పడనివ్వలేదు. ఒకట్రెండు మనం తెచ్చుకున్నవే ! మరి ఏం చేయాలి ? ఆకర్షణ ఎలా అద్దాలి ? హంగులు ఎలా దిద్దాలి ? ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లు, టూరిజం ఫెస్టులు, మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుల్లాంటి కాన్ క్లేవ్ లు కొత్త కాదు ఏపీకి ! మన స్టేట్ ప్రత్యేకత ఏంటి ? ప్రపంచంలో ఇన్ని నగరాలు ఉంటే ఇక్కడికే ఎందుకు రావాలి ? దేశంలో మిగతా సిటీలకి లేని ప్రత్యేకత ఏపీలో ఏమున్నది ? అమరావతి స్పెషాలిటీ ఏంటి ? ఈ ప్రశ్నలన్నిటికీ ఓ సమాధానం ఫార్ములా వన్ హెచ్ టు ఓ. ఇవాళే మొదలైంది.

రోడ్లు కూడా లేని రాజధానిలో రేసులు ఎందుకు పెట్టాడు చంద్రబాబు ? కనీసం పరిపాలనా భవనాలు కూడా పూర్తి కాని చోటకి ప్రపంచాన్ని ఎందుకు పిలుస్తున్నాడు ? చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నాడు ? అమరావతిని ఏం చేయాలనుకుంటున్నాడు అనే ప్రశ్నకి ఓ ఎన్నారై సమాధానం చెప్పాడు ! అమరావతిని గ్రీన్ బ్లూ కేపిటల్ గా అని ముందు నుంచి చెబుతున్నాడు చంద్రబాబు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ తర్వాత ఆసియాలోనే అంతటి ప్రఖ్యాత నగరం కాబోతోంది అమరావతి. మరి ఆ ప్రత్యేకతలు ప్రపంచానికి చాటేలా ఈవెంట్స్ నిర్వహించడం ఇప్పటి అవసరం. నగరం అంటే భవనాలు, ఆఫీసులు, కంపెనీలున్న కార్ఖానా కాదు. జీవితం కనిపించాలి. మెరుగైన ప్రమాణాలు, స్థాయిని తెలిపే ఆటవిడుపు కావాలి. ఎలాంటి రిక్రియేషన్ అందులో ఉందనే దాన్ని బట్టీ ఎవరి లెవెల్ ఆఫ్ లివింగ్ ఏంటో అర్థమయ్యే ప్రపంచం ఇది. ఇలాంటిచోట ఎఫ్ వన్ హెచ్ టు వో లాంటి ఈవెంట్ అందుకే. సియాటిల్ నుంచి వచ్చిన ఓ ఎన్నారై చమత్కరించాడు అందుకే ! ఓ జనరేషన్ ముందే అమరావతి తీర్చిదిద్దుకునే అవకాశం ఉండుంటే దీపిక రణవీర్ పెళ్లి కూడా ఇక్కడే జరిగేదేమో అని ! అదీ పవర్ ఆఫ్ అమరావతి. విజన్ ఆఫ్ చంద్రబాబు.

-->