ఈ కేసీఆర్ ఏజెంట్ చెన్నైలో ఏం మాట్లాడాడో చూడండి ! ప్యాకేజ్ కల్యాణ్ కొత్త టార్గెట్ ఇదేనా ?

తెలంగాణలో పోటీ చేసే దమ్ము లేదు కానీ సెంటిమెంట్ ని రెచ్చ గొట్టేందుకు మాత్రం రెడీ అయిపోయాడు పవన్ కల్యాణ్. అది కూడా చెన్నై వెళ్లి మరీ ! ప్యాకేజీ కల్యాణ్ కేసీఆర్ దగ్గర కూడా సుపారీ తీసుకున్నాడని చెప్పేందుకు ఇంత కన్నా రుజువు ఇంకేం కావాలి ?

పవన్ కల్యాణ్ పైసా లాభం లేకుండా ఏం చేయడు – మాట్లాడడు అనే మాట అక్షరాలా నిజం అని మరోసారి రుజువు అయిపోయింది. కన్న తల్లికి ముద్ద పెట్టనోడు పినతల్లికి చీర పెడతా అన్నట్టు మాట్లాడాడు చెన్నైలో ! ఏపీకి హోదా ఇవ్వాలంటూ టీడీపీ చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చే సత్తా లేదు కానీ తెలంగాణలో ఆంధ్రా వాళ్లని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని మాత్రం ఆరోపణ చేశాడు. రెచ్చగొట్టే ఎత్తుగడ ఇది. విమర్శలు రావాలి, దుమారం రేగాలి. ఆంధ్రా తెలంగాణా వాదులుగా విడిపోవాలి. అలాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఇది ఎత్తుగడ. చంద్రబాబు ప్రచారానికి వెళ్లే ముందు కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆడుతున్న డ్రామా ఇది. అందులో ఆర్టిస్ట్ పవన్ కల్యాణ్. కమల్ తోనో మరొకరితోనో సమావేశం అంటూ అక్కడికి వెళ్లి ఇలా ఎవరో రాసిన డైలాగులు చదవడాన్ని బట్టే చవట రాజకీయం బైటపడిపోయింది. తెలంగాణ ఎన్నికల ముందు ఎలాగోలా ఆంధ్రా తెలంగాణ వ్యవహారాలు ప్రస్తావించి, తెలంగాణలో ఆంధ్రుల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు అనడం అందులో భాగమే. చెన్నైలో మాత్రం అలాంటి పరిస్థితి చూడలేదు అంటున్నాడు. మరి ఓ పని చేయొచ్చుగా పవన్ ? అంత దమ్మే ఉంటే, నువ్ దద్దమ్మ కాదు అని నిరూపించుకోవచ్చుగా ? ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్న తెలంగాణలో పోటీ చేసి ఉండొచ్చుగా ?

మరి తెలంగాణలో ఆంధ్రుల కోసం పోరాటం చేయొచ్చుగా ? ఎన్నికలపై మాట్లాడే దమ్ము లేదు. నోటిఫికేషన్ వచ్చినా ఏం చెప్పాలో క్లారిటీ లేదు. ఆఖరికి టీఆర్ఎస్ తరపున ప్రచారం చేసేందుకు బేరం కోసం చివరి నిమిషం వరకూ పాకులాడావ్. తీరా ఇప్పుడు రూటు మార్చి కేసీఆర్ కి లాభం చేసేందుకు కొత్త నాటకమా పవన్ ? ఎంత కాలం ఈ సుపారీ డ్రామాలు ? నీదో పార్టీ నువ్వో నాయకుడివి అనిచెప్పుకోడానికి, ఒప్పుకోడానికే సగటు ఆంధ్రుకి చిర్రెత్తిపోతోంది

-->