చంద్రబాబుని తిట్టాడని ఉతికి ఆరేసింది ! పక్క రాష్ట్రంలో కూడా పరువు తీసుకున్నాడు పవన్ !

జియో వాడు జీబీల కొద్దీ డేటా ఇచ్చినా సుప్రీం కోర్టు సైట్లను బ్లాక్ చేసినట్టు అయిపోయింది పవన్ పరిస్థితి. కేసీఆర్ టిక్కట్టేసి మరీ చెన్నై పంపితే చంద్రబాబు మీద డైలాగులు కొట్టాడు పవన్. ఆంధ్రా తెలంగాణ అని తేడాలు రెచ్చగొట్టాలనేది వ్యూహం. కమల్ ని కలుస్తా అని పైకి చెప్పాడు. అందుకే పవన్ ను పిచ్చ కొట్టుడుకొద్దింది ఎవరో తెలుసా ? ఖుష్బూ ! ఆమె కౌంటర్ చూస్తే సగటు ఆంధ్రా అభిమానికి గూస్ బంప్స్ వస్తాయ్ చూడండి !

రాజకీయం అంటే ట్రెండ్ తెలియాలి. పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. ఏం చేస్తున్నామో జనం ఏమనుకుంటున్నారో తెలుసుకునే తెలివి ఉండాలి. ఇది మినియం. ఇవేమీ లేకపోతే రాజకీయం పవన్ కల్యాణ్ చేసినట్టే ఉంటుంది. చూడండి కలవక కలవక ఎవరిని కలవడానికి చన్నై పోయాడో ! కమల్ హాసన్ ని కలుస్తాడట ! అది కూడా చంద్రబాబుకి వ్యతిరేకంగా ! ఓ పక్కన కమల్ హాసనేమో నేను చంద్రబాబు ఫ్యాన్ ను బాబోయ్ అని మొత్తుకుంటున్నాడు. చంద్రబాబు లాంటి లీడర్ ఉండాలి, ఆయన ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు, ఎవరితో ఉన్నాడు అనేది కాదు పాయింట్. ఆయన పరిపాలన, విధానాలు, క్లారిటీ, ఆలోచన నాకు చాలా బాగా నచ్చుతాయ్. పాతికేళ్ల నుంచి చూస్తున్నా – హ్యాట్సాఫ్ అన్నాడు. అది కూడా బీజేపీతో పొత్తులో ఉండగా ! ఏడాది కిందట. ఇప్పుడు చంద్రబాబు మోడీతో తెంచుకున్నాడు. బీజేపీని దంచుతున్నాడు. పార్టీలను ఏకం చేస్తున్నాడు. అంటే కమల్ ఐడియాలజీ కూడా కనెక్ట్ అయిపోయింది. ఇలాంటి సమయంలో పవన్ వెళ్లి కమల్ ని కలవడం దేనికి ? పైపెచ్చు కాంగ్రెస్ పార్టీతో లాభం లేదు అంటాడు. మరి హోదా ఎవరు ఇస్తారు ? తన మిత్రపక్షం బీజేపీ ఇవ్వను అంటోంది కదా ? అందుకే ఇంతటి అయోమయం ఉన్న పవన్ ను ఖష్బూ ఉతికి ఆరేసింది. ఆమె తమిళ రాజకీయంలో కొన్నేళ్లుగా చురుగ్గా ఉంది. డీఎంకే నుంచి కాంగ్రెస్ లో చేరింది. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉంది.

అసలు పవన్ కల్యాణ్ కి ఏం కావాలి ? ముందు ఆయన తెలుసుకుంటే నయం. కమల్ సర్ చంద్రబాబును పొగుడుతారు. ఫ్యాన్ ను అంటారు. ఆల్రెడీ డీఎంకేతో కలిసి పని చేసేందుకు కూడా సిద్ధం అన్నారు. డీఎంకే కాంగ్రెస్ టీడీపీ అన్నీ మిత్ర పక్షాలు ఇప్పుడు. ఇలాంటప్పుడు చంద్రబాబుకి వ్యతిరేకంగా కమల్ ని కలవడం అనే ప్రశ్న ఎక్కడిది ? ఆయన స్థిమితంగా ఆలోచించుకుంటే నయం. కాస్త పరువు దక్కుతుంది. అంతకు మించి కామెంట్ చేయడానికి ఏం లేదు అని చెప్పేశారు. హైద్రాబాద్ శివార్లలో ఇంగ్లిష్ మీడియా పిచ్చాపాటీలో వచ్చిందీ టాపిక్ !

-->