తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ ! పవన్ కోసం బీజేపీ ప్లాన్ బి !

సొంత ఊళ్లో దేకలేకపోయినా పక్క ఊళ్లో పాకుతా అన్నట్టుగా ఉన్నాయ్ పవన్ ప్రయత్నాలు. ఏపీలో ఏం చేయాలో, ఎవరితో కలిసి పోటీ చేయాలో తేలకుండానే చెన్నై వెళ్లి కమల్ హాసన్ తో సమావేశం కావడానికి కారణం అదే ! పవన్ ను దక్షిణాది రాష్ట్రాల్లో వాడేసేందుకు బీజేపీ ప్లాన్ బి సిద్ధం చేసింది. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోతే, ఎపీలో ఎలాగూ పీకేడానికి ఏముండదు కాబట్టి తెలంగాణలోనే ఎంపీగా పోటీ పెడతామని భరోసా ఇచ్చింది. అందుకే ఇప్పుడు ఏపీ విడిచి సాము చేసేందుకు పవన్ సిద్ధం అయ్యాడు.

తెలంగాణలో బీజేపీ సైలెంట్ గా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా హడావుడి లేదు. సడీచప్పుడూ లేదు. ఎందుకంటే అందరూ కలిసి కేసీఆర్ ను ఎలాగోలా ఒడ్డున పడేయాలన్న ప్లాన్. అందుకే జగన్ పోటీ చేయడంలేదు.పవన్ అటు వైపు కూడా చూడటం లేదు. మోడీ రావడం లేదు. ఎంఐఎం కూడా టీఆర్ఎస్ వైపే ఉంటోంది. అంటే ఓటు చీలకుండా జాగ్రత్త ఇది. ఇప్పుడు సైలెంట్ గా ఉంటే పార్లమెంటు ఎన్నికల నాటికి బీజేపీ యాక్టివ్ అవ్వాలన్నది ఐడియా. అసెంబ్లీ కేసీఆర్ కి వదిలేసి, అదృష్టం పరీక్షించుకోమంటారు. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీజేపీ లీడ్ తీసుకుంటుంది. అదీ ప్లాన్. అందుకోసమే పవన్ కి బీజేపీ భరోసా ఇచ్చింది. ఏపీలో తన్నేసినా పర్వాలేదు. మనం అజెండా మార్చుకుందాం. ఏం చేయాలి, ఎలా చేయాలి, యాంటీ చంద్రబాబు స్టాండ్ ఎలా తీసుకోవాలన్నది డిసెంబర్ 11 తర్వాత తేలుతుంది. ముందు నువ్వైతే నీ ప్రయత్నాల్లో ఉండు అని చెప్పేశారు. తెలంగాణలో ఎంపీగా పోటీ పెడతామని భరోసా ఇచ్చారు. బహుశా మల్కాజ్ గిరీ లేదంటే సికింద్రాబాద్ ల నుంచి పవన్ బీజేపీ అభ్యర్థి గా పార్లమెంటు బరిలో దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయ్. బీజేపీకి కాస్తో కూస్తో బలం ఉన్నదని ఫీలింగ్. పైగా పవన్ – నేను పుట్టి పెరిగింది తెలంగాణే అంటాడు. అన్నిటికీ మింటి టీఆర్ఎస్ ఓడిన తర్వాత మెదక్ నుంచి పోటీ చేసేందుకు ఎలాగూ లగడపాటి రెడీ అవుతున్నాడు కాబట్టి ఇక ఆంధ్రా తెలంగాణ ఫీలింగ్ ఉండదని ఆలోచన.

అందుకే పవన్ కల్యాణ్ ఇప్పుడు పక్క వాయిద్యాలు వాయించడంలో బిజీ అవుతున్నారు.అయితే గోదావరి జిల్లాలు, లేదంటే ఇలాంటి టూర్లు ఇక ముందు కూడా ఉంటాయ్ అంటున్నారు. త్వరలో కేరళలో తిరుగుతాడని చెబుతున్నారు. ఇదంతా బీజేపీ స్కెచ్ లో భాగం. ఇందులో ఏపీకి ఓ పాజిటివ్ ఉంది. ఒకటి కేసీఆర్ ఓడిపోవడం, రెండోది పవన్ ఏపీ విడిచిపోవడం !

-->