ఫోర్త్ రౌండ్ కి పవన్ కల్యాణ్ రెడీ ! త్వరలో అఫీషియల్ ప్రకటన !

అలవాటైన ప్రాణం అల్లల్లాడిందని సామెత. పవన్ వాటం కూడా అలాగే ఉంది. తన తీరే అంతో – లేదంటే కమిట్ అయ్యాడు కాబట్టి తప్పడం లేదని చెబుతాడో కానీ మొత్తానికి మేటర్ అయితే ఫిక్స్. తొందర్లోనే అఫీషియల్ ప్రకటన !

ఓ నాయకుడికి గురించి తల్చుకోగానే మనసులో ఓ పిక్చర్ వచ్చేస్తది ! అది వాళ్ల ఒరిజినాలిటీ ! వాళ్లు చేసే పనులు చెప్పే మాటలు కొన్నాళ్లుగా వినీ వినీ వాళ్ల మీద మన మైండ్ లో ముద్ర పడిన పిక్చర్ అలా కళ్ల ముందు కనిపిస్తుంది. సపోజ్ చంద్రబాబుని తీసుకోండి. బాబు అనగానే కష్టపడే నాయకుడు అనో – సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలన్న మాటలో ఏవో గుర్తొస్తాయ్. కొన్ని సార్లు టెక్ట్సు బుక్కులా కూడా అనిపిస్తాడు కానీ విషయం అయితే అదే. సీరియెస్ నెస్ కూడా అదే ! అదే మోడీని తల్చుకున్నామనుకోండి ఆ పొగరు, అహంభావం, కెమెరా ఎక్కడుందో తాను కనిపిస్తున్నానో లేదో అనే ఆతృత కనిపిస్తాయ్. ప్రచారం యావ ఇదంతా ! అలాగే జగన్ ను చూడగానే, తలవగానే రాజారెడ్డి 2.0 అనిపిస్తాడు. పర్సు చెక్ చేసుకుంటాం ! హమ్మయ్య ఉందిలే అని రిలీఫ్ ఫీలవుతాం. మరి పవన్ కల్యాణ్ అనగానే ఏం గుర్తొస్తది ? గాలితనం, గాలి మాటలు, లేకి కామెంట్లు, టీడీపీ ఓట్లు తీయించేస్తోంది లాంటి అజ్ఞానం మాత్రమేనా ? కాదు ఆయన సొంత జీవితంలో పెట్టుకున్న పొత్తులు కూడా గుర్తొస్తాయ్. కొందరితో అఫీషియల్ గా కొందరితో అనఫీషియల్ గా ఆయన సాగించిన జీవితం గుర్తొస్తది. అందుకే ఇపుడు నాలుగో రౌండ్ కి రెడీ అవుతున్నాడు అనగానే బహుశా అదే అనుకుంటారు ! అది ఆయన సంపాదించుకున్న ఇమేజ్ ! దానికి ఎవరేం చేయలేం !

ఇంతకీ ఫోర్త్ రౌండ్ పాయింట్ చెప్పలేదు కదూ ! చంద్రబాబు తెలంగాణలో ప్రచారానికి వెళ్లే సమయానికి పవన్ ఏం చేయాలన్న స్క్రిప్ట్ వచ్చేసింది. చలో అమరావతి మళ్లీ ! ఇప్పటికే మూడు సార్లు పెట్టాడు ఇలాంటి స్టంటు. జనంతో ఇంటారక్షన్ అనో, పెరుగన్నం తినే ప్రోగ్రామో పెట్టాడు. ఆ మూడు ఊళ్లలో కొంత మందిని మళ్లిస్తాడు. మళ్లీ అలాంటి కాలక్షేపం ప్రోగ్రామ్ ప్రిపేర్ అవుతోంది. ఫస్ట్ మీటింగ్ పెట్టేశాడు. సో ఫోర్త్ రౌండ్ కి రెడీ !

-->