యాక్టివ్ గా లేడు – పర్సనల్ గా డామేజ్ అయ్యాడు ! అయినా 65 శాతం ఓట్లా ? ఇదీ పవర్ ఆఫ్ టీడీపీ !

చాలా మందికి ఓ లాజిక్కు అర్థం కావడం లేదు. 90 సీట్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ ని వదిలేసి కేసీఆర్ ఎందుకు టీడీపీ మీద పడుతున్నాడు ? పట్టుమని 13 సీట్లలో పోటీ చేస్తున్న పార్టీని ఎందుకు ప్రత్యర్థిగా ప్రకటిస్తున్నాడు – అంటే ఇదే లెక్క. టీడీపీ పోటీ చేసేది తక్కువ అయినా ఓడించేది ఎక్కువ. పెద్దగా యాక్టివ్ గా లేని లీడర్ కి కూడా వచ్చిన రెస్పాన్స్ చూస్తే కేసీఆర్ భయానికి కారణం ఏంటో తెలిసిపోద్ది !

ఆయన మాస్ లీడర్ కాదు. యాక్టివ్ గా లేడు. గత ఎన్నికల్లో నారో మార్జిన్ తో ఓడిపోయాక సైలెంట్ అయిపోయాడు. వ్యాపారాలు కూడా దెబ్బతిని పోయాయ్. పై పెచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ని పిండి పిసికినట్టు పిసికేసింది. అందుకే కలుగులోకి వెళ్లిపోయాడు. అన్నిటికీ మించి ఆయనపై వ్యక్తిగతంగా కూడా దాడి చేయించింది టీఆర్ఎస్. ఆడవాళ్ల వ్యవహారాలు అవీ చాలానే జరిగాయ్. ఇలాంటి సమయంలో ఆయన బరిలో దిగేందుకే ధైర్యం చేయలేదు. చంద్రబాబు చెప్పాడని ఒప్పుకున్నాడు. బలవంతంగా నామినేషన్ వేసేందుకు బయర్దేరాడు. జనం రెస్పాన్స్ చూసి షాక్ అయ్యాడు. అరే బాబోయ్ దారి ఇవ్వండ్రా, నిలబడలేకపోతున్నా అనేంతగా ఉప్పొంగింది అభిమానం.

అవునా ఇలా ఉందా పార్టీకి ఆదరణ అని సర్వే తీయించాడు. మూడొంతుల ఓట్లు పడతాయ్ అని తేలింది. కాదు. కరెక్ట్ కాదు అని మళ్లీ శాంప్లింగ్ తీశాడు. ఈసారి ఏకంగా 10 వేల శాంపిల్స్. మామూలుగా అయితే నియోజక వర్గానికి ఓ 2 వేలు తీస్తే ఎక్కువ. అలాంటిది 5 రెట్లు ఎక్కువ అనమాట. అందులో కూడా ఏకంగా 67 శాతం ఆయనవైపే వచ్చింది. అంతే ఆయనకి ఇక పట్టపగ్గాల్లేవు. ఆయనకే కాదు టీడీపీకి దాదాపుగా ఇలాగే ఉంది. ఎందుకంటే జనంలో కసి. మనకి ఛాన్సు వచ్చిందనే కాన్ఫిడెన్స్ కలిసి నడిపిస్తున్నాయ్ ఇప్పుడు. అందుకే భయపడుతున్నాడు కేసీఆర్.

-->