చంద్రబాబుతో రాహుల్ ఫస్ట్ మాట ఇదే !

ఇప్పటి వరకూ ఇద్దరూ ప్రత్యేకంగా కలిసి మాట్లాడుకున్నది లేదు. వేదిక మీదో, కామన్ ప్లాట్ ఫామ్ పైనో కలవడం, కరచాలనం ఉంది కానీ మీటింగ్ మాత్రం లేదు. రెండు పార్టీలు కూడా ఉత్తర దక్షిణాలు నిజానికి ! అలాంటిది ఫస్ట్ టైమ్ కలిసీ కలవగానే రాహుల్ గాంధీ చంద్రబాబును ఏమన్నారో తెలుసా ? సర్ ప్రైజింగ్ గా అనిపిస్తుంది చూడండి !

యు ఆర్ ద సన్ షైన్ లీడర్, వెల్ కమ్ అంటూ స్వాగతించాడు రాహుల్ గాంధీ. ఇప్పటి వరకూ రాహుల్ గాంధీ వైపు ఏం లేదు. పార్టీలు లేవు. సమర్థకులు లేరు. లక్కు లేదు,. వ్యూహం లేదు. ఏం చేయాలో అర్థం అయ్యే పరిస్థితి లేదు. చంద్రబాబు రంగంలోకి దిగిన తర్వాత సినిమా మారుతోంది. పార్టీలు ఏకం అవుతున్నాయ్. చంద్రబాబు క్రమంగా కూటమి నిర్మిస్తున్నాడు. రేపో మాపో కాంగ్రెస్ ను కూటమిలోకి తేవడమో, లేదంటే కాంగ్రెస్సే కూటమికి మద్దతిచ్చేలా చేయడమో చేస్తారు. అందుకే రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా అన్నాడు ఈ మాట. మామూలుగా అయితే ఏపీ ఓ ట్యాగ్ లైన్ పెట్టుకుంది. సన్ రైజ్ స్టేట్ అని. ఇప్పుడు రాహుల్ అన్న మాట కాస్తో కూస్తో అలాగే ఉంది. దాంతోపాటు మా వైపు వెలుగు వచ్చింది అనే అర్థం వచ్చేలా కూడా రాహుల్ వ్యూహాత్మకంగా అన్నారు. అలా అన్నప్పుడు చంద్రబాబు ముఖం చూడాలి. ముసిముసిగా నవ్వుతూ పలకరించారు. ఇట్స్ ఎ న్యూ బిగినింగ్ అంటూ హ్యాండ్ షేక్ చేశారు. వాళ్లిద్దరి మాటల్నీ చుట్టూ ఉన్నవాళ్లు ఆసక్తిగా చూస్తుండిపోయారు. రాహుల్ తో చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు మరో ఆరేడు మంది కూడా అక్కడ ఉన్నారు. ఇటు వైపు టీడీపీ ఎంపీలు ఉంటే, అటు పక్కన కొప్పుల రాజుతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. మొత్తానికి బిగినింగ్ లో రాహుల్ పలకరింపు వాతావరణాన్ని ఉత్సాహపరిచింది.

చంద్రబాబు రాకతో కాంగ్రెస్ లో కాదు దేశంలో దిలాసా కనిపిస్తోంది. ఆల్టర్ నేటివ్ వచ్చేసింది. అది కూడా సరైన సమయంలో. సెమీఫైనల్ లాంటి ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు గేర్ మార్చాడు. నేను ఉన్నాను అంటూ రంగంలోకి దిగాడు. అందుకే ఇప్పుడు ఈ మీటింగ్ ప్రత్యేకం. నవంబర్ 1, 2018 ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది ఢిల్లీ రాజకీయాల్లో !

-->