చంద్రబాబు – రేవంత్ – తెలంగాణ – లెక్క ఇదేనా ? అందుకే ఇంత కీలక బాధ్యతలు ఇచ్చిందా కాంగ్రెస్ ?

అంత కీలక బాధ్యతలు రేవంత్ కా ? చంద్రబాబుతో కాంగ్రెస్ కలిస్తే రేవంత్ బహుబలి అయ్యాడా ? ఇదే డౌటు కొడుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ లాంటి పార్టీలో అలాంటి అవకాశం రావాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. కానీ రేవంత్ కి మాత్రం ఏడాది తిరిగేప్పుడే వచ్చింది ! అంటే ఏంటి మేటర్ ? బాబు సపోర్ట్ రేవంత్ కి అంత పెద్ద ప్లస్సయిందా ?

మామూలుగా ఛాన్సు కాదు ఇది. కాంగ్రెస్ లో చేరి సరిగ్గా ఏడాది కూడా కాలేదు. అప్పుడే రెండో బంపర్ ఛాన్స్ కొట్టేశాడు రేవంత్. పైపెచ్చు ఇది ఎన్నికల సమయం. కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంది. కచ్చితంగా గెలవబోతోంది అనుకుంటున్న వేళ రేవంత్ కి మరో కీలక బాధ్యత. సోనియా సభ ఏర్పాట్లు రేవంతే చూసుకుంటాడు అంటున్నారు. ఆల్రెడీ మొన్న రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లు రేవంతే చూశాడు. శేరిలింగం పల్లి సోసోగా సాగినా, సరూర్ నగర్ సభ అందుకే అంత హిట్టయింది. ఇప్పుడు సోనియా సభ బాధ్యతలు కూడా రేవంతే చూసుకుంటున్నారు. ఎందుకు కీలకమో తెలుసా ? తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత సోనియా రావడం ఇదే మొదటి సారి. పైగా ఎన్నికల సమయం. ఆల్రెడీ కేసీఆర్ తిట్టి పోశాడు. బూతులు తిట్టాడు. తెలంగాణ ఇచ్చినప్పుడేమో దేవత అన్నాడు. ఇప్పుడు దెయ్యం అంటున్నాడు. పైపెచ్చు సోనియా రాకతో తెలంగాణ రాజకీయం క్లియర్ కట్ గా కాంగ్రెస్ వైపు మొగ్గి పోతుందనే అంచనాలు ఉన్నాయ్. ఇలాంటప్పుడు మామూలుగా అయితే బాధ్యతలు కాంగ్రెస్ లో పండిపోయిన వాళ్లో, దిగ్గజాలో చూస్తారు. అలాంటిది రేవంత్ కి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. రేవంత్ సమర్థుడు. రేవంతే చూసుకుంటాడు అంటోంది కాంగ్రెస్. అంటే అర్థం ఏంటి ? కాంగ్రెస్ లో రేవంత్ వెయిట్ పెరుగుతోందా ? చంద్రబాబు ఆశీస్సులు కూడా కలిసొస్తున్నాయా ?

చంద్రబాబుతో కాంగ్రెస్ కలవడం అంటే బాడీలో బ్రెయిన్ ఫిక్స్ కావడమే అన్నా ! బాబుగారు వచ్చాడంటే మామూలుగా ఉండదిక. ఇక్కడ అలాంటోడు లేకే ఈని ఆటలు సాగుతున్నాయ్ అంటూ రేవంత్ మాట్లాడతాడు ఎప్పుడూ. పైగా బాబు భక్తుడు. కాంగ్రెస్ వేదిక మీద కూడా ఆ మాట చెప్పేందుకు సిద్ధం అంటాడు. రాహుల్ గాంధీ సమక్షంలోనే బాబుతో ఎగబడి మాట్లాడాడు. అందుకే కాంగ్రెస్ వాళ్లకి రేవంత్ ని చూస్తే భయం మరింత పెరిగింది. వీడు మామూలుగానే బుడ్డ మిర్చి, ఇప్పుడు బావొచ్చి కలిశాడు అని మాట్లాడుతున్నారు వాళ్లు. ఇది కచ్చితంగా ఫ్యూచర్ కాంబినేషనే. బాబు + రేవంత్ !

-->