నేనైతే బయట పడతానేమో చూడాలి మరి ! పెద్ద దిక్కు మాటతో అన్నం మానేశాడు కేసీఆర్ !

జిల్లాకి ఆయన పెద్ద దిక్కు. ఆ మాటకొస్తే కేసీఆర్ ప్రభుత్వానికి కూడా పెద్ద దిక్కే. అలాంటి మనిషి నిక్కచ్చిగా నిఖార్సుగా చెప్పేశాడు – జిల్లాలో నేను బయటపడితే గొప్పే అని. అంతే కేసీఆర్ ముఖంలో రంగులు మారాయ్. భోజనం రెడీ చేసినా తినడం మానేశాడు. సరే బయల్దేరదాం ఇక అని వెళ్లిపోయాడు.

అవును. ఖమ్మంలో సీనే. కేసీఆర్ అప్పటి వరకూ యాగంలో ఉన్నాడు. తీర్థ ప్రసాదాలు తీసుకొని హెలికాప్టర్ ఎక్కేశాడు. తిండి లేదు. అది కూడా లేదు. అదంటే తెలుసుగా. సర్లే అక్కడ చూద్దాం పాండి అని వెళ్లిపోయాడు. ఎందుకంటే ఏకాదశి ఘడియలు. ముహూర్తం ముఖ్యం అనుకున్నాడు. తీరా అక్కడికి వెళ్లాక పిచ్చా పాటీ మొదలు పెట్టాడు. మొదట టౌన్ బరిలో ఉన్న కుర్ర ఎమ్మెల్యేతో మాట్లాడాడు. అతను కూడా అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పాడు. నువ్ ఎంత తిరిగినా రంగు మారవన్నట్టుఉంది. అంటూ జోక్ కూడా వేశాడు కేసీఆర్. ఆ అభ్యర్థి కాస్త నలుపు లెండి. అటు తర్వాత అన్నా ఎట్లుందని పెద్ద దిక్కువైపు తిరిగాడు.

అప్పటి వరకూ పీకల్లోతు ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఆ పెద్ద మనిషి బైటపడిపోయాడు. నేను బయట పడితే పడతనేమో అన్నాడు. అంతే కేసీఆర్ సైలెంట్ అయిపోయాడు. అందుకే మాకు ఇక్కడ సీట్లు రాలేదు. ఇప్పుడు కూడా అలాగే అంటున్నారు కొందరు అని మొదలు పెట్టాడు వేదిక మీద. దాని వెనక అసలు కారణం ఇదే. కానీ ఒక్కటైతే వాస్తవం. ఆ పెద్ద కిక్కు కూడా నియోజక వర్గంలో ఓ పాతిక ఊళ్లలోకి అడుగుపెట్టే పరిస్థితి లేదట. బేసిక్ గా నాది రెడ్డి సీటు. కమ్మోడిని ఎందుకు రానిస్తర్లే అని ఆయన సరిపెట్టుకున్నా జిల్లా మొత్తం ట్రెండ్ ఎలా ఉందో చెప్పేందుకు ఇదే సీన్.

-->