సుహాసినికి ఒకే మాట చెప్పాడు చంద్రబాబు ! ఎఫెక్ట్ ఎలా పని చేసిందో చూడండి !

ఆనందం, ఆవేదన కలగలిసి వచ్చేశాయ్ సుహాసిని మీడియా ముందుకు రాగానే ! ఎందుకంటే వచ్చీ రావడంతోనే ఆమె హరిక్రిష్ణ ఫోటోకి దండ వేసి నమస్కరించి మొదలు పెట్టారు ! హరన్న లేడు అనే ఉద్వేగం, సుహాసిని వచ్చిందన్న సంతోషం అభిమానుల్లో కలిగాయ్. మాట్లాడ్డం మొదలు పెట్టిన తర్వాత అర్థం అయిపోయింది రాజకీయం ఆ బ్లడ్ లోనే ఉందని. ఎక్కడా తొట్రపాటు లేదు. తడబాటు లేదు. కాస్త ఇబ్బంది అనిపిస్తే చాలు, నామినేషన్ వేసిన తర్వాత డీటైల్డ్ గా మాట్లాడదామంటూ అలవోకగా పడిపోయింది తొలి అడుగు ! చంద్రబాబు చెప్పిన మాట కూడా సుహానికిపై బలంగా పని చేస్తోందని దగ్గరి వాళ్లు చెబుతున్నారు ఇప్పుడు ! ఇంతకీ బాబు ఏం చెప్పాడు ?

సుహాసిని మాట్లాడ్డం చూశారా ? జనం కోసం పుట్టిన పార్టీ తెలుగు దేశం. జనం అభిమతానికి అనుగుణంగా అడుగు వేస్తుంది. ఇది పేదల పార్టీ అనడం చూస్తే నందమూరి వాయిస్ ఇదే, ప్రత్యేకంగా వీళ్లకి ఎవరో చెప్పాల్సిన పని లేదు అని అనిపించింది మొదటి నిమిషమే ! నాన్న ఆదర్శాలు, తాతగారి ఆశీస్సులతో మామయ్య చంద్రబాబు పంథాలో సాగుతా అంటూ సుహాసిని చెబుతున్నప్పుడు రేపటి తరం ఎలా ఉంటుందో తెలిసింది అందరికీ. నేను ఇంకా కొత్త. ప్రత్యేకంగా మాట్లాడతా. ప్రతి నిమిషం నేర్చుకుంటా, కష్టపడతా. జనం కోసం ఉండటమే నడవడమే రాజకీయం అని తాతగారు నిరూపించారు. చంద్రబాబు మామయ్య కూడా అదే చెప్పారు నాకు. నువ్వు నీలా ఉండు. ఎప్పుడూ కాంప్రమైజ్ కాకు. ఏం ఇబ్బంది అనిపించినా నాకు చెప్పు. జనం ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకో అని మాత్రమే చెప్పారు. అదే నాకు దారి. నేను అలాగే నడవబోతున్నాను అన్నారామె. తనకి ఫ్యామిలీ మొత్తం అండగా ఉండని, తనతో పాటు వాళ్లు కూడా ఉంటారన్న భరోసానే తన దైర్యం అని చెబుతున్నప్పుడు నందమూరి అభిమానుల్లో ఆనందం ఉప్పొంగింది. నిజం. ఎందుకంటే సుహాసిని కూకట్ పల్లిలో పోటీ చేయడం అంటే ఓ అసెంబ్లీ సీట్లో పోరాటం కాదు. అక్కడ ఎవరు నిలబడినా గెలుస్తారు. సందేహం లేదు. కాకపోతే హరిక్రిష్ణ కూతురు రంగంలోకి దిగడం అంటే ఓ సంకేతం.

నందమూరి ఫ్యామిలీ ఒక్కటిగా ఉందని, చంద్రబాబుతో ఉందని చెప్పడం. అభిమానుల్ని ఏకం చేయడం. ఆంధ్రా ప్రాంత ఓటర్లకే కాదు, తెలంగాణలో తెలుగు దేశం, నందమూరి అభిమానులకి కూడా ఓ సందేశం ఇవ్వడమే. అందుకే కేసీఆరే కాదు జేజమ్మ దిగొచ్చినా తట్టుకోలేరు. నిలవలేరు. ఖాయం!

-->