సుమకి ఎంత తెలివో ! మోడీ మీద డైలాగ్ కొట్టకుండా తప్పించుకుంది !

గలగల మాట్లాడుతూ, ఫంక్షన్ ఏదైనా కామన్ గా ఉండి తీరేది నేనే అన్నట్టుంటుంది సుమ. ఆమెకి ఎంత క్రేజ్, ఆమెను ఎందుకు ఇన్నేళ్లుగా చూస్తున్నాం ? అనే మాటకి ఓ చిన్న సైజు జస్టిఫికేషన్ ఇచ్చేసింది. మోడీ మీద డైలాగ్ కొట్టాల్సిన సందర్భాన్ని ఆమె ఎలా మలుపు తిప్పిందో చూడండి !

ఎంత సేపూ రాజకీయాలేనా వీకెండ్ అన్నప్పుడు కాస్త ఛేంజుండాల. అన్నీ చూస్తుండాల అని టీవీ చూస్తున్నా – రాజకీయమే కనిపిస్తోంది ! ఏం చేద్దాం చెప్పండి. కాకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పడానికి కారణం రాజకీయం కాదు. సుమ. ఆమె ఎంత సెన్సిబులో, దాదాపు రెండున్నర దశాబ్దాలు అవుతున్నా ఆమె మనకి ఎందుకు బోరు కొట్టలేదో, కొట్టదో చెప్పే పాయింట్ ఇది. ఈటీవీలో ఓ షో వస్తుంది ప్రతీ శనివారం. క్యాష్. అందులో ఎవరెవరో వస్తారు. ఏవేవో గేమ్స్ ఆడతారు. డబ్బులిస్తారు. నిజంగా ఆ డబ్బులు ఇస్తారా ? చూపిస్తారా ? అనేది కూడా చాలా మందికి డౌటు. అది వేరే మేటర్. మోడీ సంగతి ఏంటో చూద్దాం. మోడీకి నేరుగా తగిలే పాయింట్ ఒకటి ఆ షోలో వచ్చింది. ఏ దేశంలో ఏటీఎం నుంచి బంగారం విత్ డ్రా చేసుకోవచ్చు ? అనేది క్వశచ్న్. అమెరికా దుబాయ్ నేపాల్ ఇండియా అనేవి ఆప్షన్స్. నేపాల్ కి అంత సీన్ లేదు. అమెరికా తెలుసు. కాదు. ఇక దుబాయ్ అంటే గోల్డ్ అనే ముద్ర ఉంటుంది, మనోళ్లు ఎవరైనా వెళ్తుంటే ఓ చిన్నం బంగారం అయినా తెచ్చిపెట్టమని అడుగుతాం కాబట్టి అందరూ అదే పేరు చెప్పారు. ఇండియాను పట్టించుకోలేదు ఎవ్వరూ !

అదే విషయాన్ని ఆమె సమప్ చేస్తోంది. దుబాయే అయ్యుంటుంది. ఇండియా కాదు కదా. అంది. అదే ఇండియా అయ్యుంటే ఇక్కడ భర్తల్ని భార్యలు చంపేసేవాళ్లు వేధించి. విత్ డ్రా చేద్దాం చేద్దాం అని. అంటూ జోకేసింది. నిజానికి మన దగ్గర ఏటీఎంలలో డబ్బులే రావు. ఇక బంగారం ఎక్కడ వస్తుంది అనేవాళ్లు ఎవరైనా ! కానీ అక్కడున్నది సుమ. ఎవరినీ నొప్పించకూడదు. మెప్పించాలన్నది ఆమె పాయింట్. అందుకే టాక్టికల్ గా వేసింది డైలాగ్. ఆ సెన్సిబిలిటీ చూశాక కాస్త ఆశ్చర్యం వేసింది. నిజమే. మన ఏటీఎంలలో డబ్బే రాదు. ఇప్పటికీ రావడం లేదు. మోడీ ఉన్నంత వరకూ రాదు కూడా. కానీ సుమ ఆ మాట అనలేదు.

-->