ఈ కుర్రాళ్లిద్దరూ గెలిచేశారు ! జగన్ నిర్ణయాలతో టీడీపీ యమ ఖుషీ !

షెడ్యూల్ రాక ముందే సంబరాలు చేసుకునేంత ఉత్సాహం ఉందిప్పుడు ! ఆల్రెడీ ఉన్న వాళ్లకి ఎలా చెప్పి ఒప్పించాలన్న చంద్రబాబు టెన్షన్ తీర్చాడు. కుర్ర నాయకుల్ని ఖుషీ చేశాడు జగన్. అవును. జగనే ! ఇటు సికాకుళంలో అటు అమలాపురంలో వైసీపీ నిర్ణయాలతో టీడీపీ యమ హ్యాపీగా ఉంది.ఎందుకో చూడండి !

అమలాపురం ఎంపీ రవీంద్ర ఏదిబడితే అది మాట్లాడి విమర్శల పాలవుతాడు అనే పేరు ఉంది ముందు నుంచి. టీడీపీ కవర్ చేయలేక చచ్చేది. కేవలం మందు కోసం, మటన్ కోసం ఆశపడే సైన్యంలో చేరతారు అని కామెంట్ చేసింది రవీంద్రే. అటు తర్వాత ఈ దేశంలో మేం ఎందుకు ఉండాలంటూ ఏదేదో లెక్చర్లు దంచి నేషనల్ లెవెల్లో వివాదాస్పదం కూడా అయ్యాడు. జనంలో మాత్రం పట్టు పెంచుకోలేక పోయాడు. పై పెచ్చు ఇపుడు చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ఇంకా పలచన అయిపోయాడు. అలాంటి రవీంద్ర అమలా పురంలో జగన్ కి ఎంపీ అభ్యర్థి అవుతున్నాడు. నిజానికి వైసీపీకి అక్కడ వెంట్రుకంత కూడా పట్టు కూడా లేదు. అందుకే హర్ష కుమార్ ను తీసుకోవాలి అనుకున్నాడు జగన్. హర్షకుమార్ రాక కూడా ఇక ఉండదు. ఆ రకంగా ఓ నష్టం. రెండోది – టీడీపీ అక్కడ జీఎంసీ బాలయోగి కొడుకు హరీశ్ ను బరిలో దింపుతోంది. బాలయోగికి ఉన్న పేరు ప్రతిష్టల్ని బట్టీచూస్తే అక్కడ వైసీపీ పోటీ పెట్టకపోవడమే ఉత్తమం అనేంత పాజిటివ్ ఉంది. మరి ఇలాంటప్పుడు అమలా పురం పంచాయతీ ఎందుకు చెప్పండి !

ఇక సికాకుళం. అక్కడ కిల్లి కృపారాణి కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరారు. వాగ్ధాటిలో అయినా, మోడీని నేరుగా నిలదీయడంలో అయినా సికాకుళం యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు నేషనల్ రేంజిలో పాపులర్. అలాంటి రామ్మోహన్ మీద కిల్లి పోటీ చేయడం అంటే వార్ వన్ సైడే ! ఎందుకంటే కిల్లి అక్కడ ఎంపీగా ఉన్నన్ని రోజులూ జనంలోకి వెళ్లింది లేదు. ఏం చేసిందీ లేదు. అంత బ్యాడ్ నేమ్ పెట్టుకొని, ఇప్పుడు గుడ్ విల్ ఉన్న రామ్మోహన్ నాయుడు లాంటి నాయకుడు మీద పోటీ చేయడం అంటే డబ్బు దండగ యవ్వారమే ! అందుకే వీళ్లిద్దరిని జగనే గెలిపిస్తున్నాడు అంటున్నది. ఇక హరీశ్, రామ్మోహన్ పండగ చేస్కోచ్చు !

-->