టీడీపీ తలుపు కొడుతున్న శిల్పా మరి చంద్రబాబు తెరుస్తాడా ?

ఓసారి ఓడగొట్టాడు. ఉన్న పదవులు కూడా ఊడగొట్టాడు. ఇప్పుడు కూడా పక్కన రాష్ట్రం నుంచి ఎవరినో పట్టుకొచ్చిన వాళ్ల కోసం మీకు టిక్కెట్టు లేదు పొమ్మన్నాడు. ఆల్రెడీ చెప్పేశాడు. అందుకే శిల్పా బ్రదర్స్ టీడీపీ తలుపు తట్టడం ఖాయం అంటున్నారు. మరి చంద్రబాబు తలుపు తీస్తాడా ?

ముందు కర్నూల్లో ఏం జరుగుతోందో డీటైల్డ్ గా చూద్దాం. కేసీఆర్ గేమ్ ప్లాన్ లో భాగంగా ఏపీలో ఎంఐఎం పోటీకి దిగుతోంది. జగన్ మద్దతు ఇస్తున్నాడు. ఏకంగా పొత్తు పెట్టుకుంటా అంటున్నాడు. దాదాపు ఖాయం అయిపోయింది అంటున్నారు కూడా ! ఆ పొత్తులో భాగంగానే జగన్ నంద్యాల సీటు ఎంఐఎంకి ఇస్తాడు అని చెబుతున్నారు. రెండు కారణాలు ఉన్నాయ్. ఒకటి ముస్లింలు ఎక్కువగా ఉండటం. రెండోది పరాజయ భారం. జగన్ గత ఉప ఎన్నికల్లో 13 రోజులు మకాం వేసినా లాభం లేకపోయింది. ఏకంగా 27 వేల మార్జిన్ తో చావు దెబ్బతింది వైసీపీ. జగన్ పార్టీ నేల మట్టం అయిపోయింది అనే ముద్ర కొట్టేసింది నంద్యాల ఫలితం. అందుకే నంద్యాల అంటే జగన్ కి మంట. ఇప్పుడు అక్కడ పోటీచేయకుండా పోతుంది కదా అనే లెక్కతో ఎంఐఎంకి ఇచ్చేస్తున్నాడు సీటు. అక్కడ ఆల్రెడీ దెబ్బతిని పోయి, అన్ని రకాలుగా నీరసపడిపోయిన శిల్పా బ్రదర్స్ కి ఈ విషయం క్లియర్ గా చెప్పేశాడు అని టాక్ నడుస్తోంది. మీకు ఎమ్మెల్సీ ఇస్తా, నన్ను ఇబ్బంది పెట్టకండి అనేశాడు. డీల్ క్లోజ్ చేసేశాడు. వీళ్లకేమో ఇష్టం లేదు అని కర్నూలు మొత్తం మాట్లాడుకుంటోంది. శిల్పా బ్రదర్స్ టీడీపీ వైపు చూస్తున్నారు అనే టాక్ కి ఇదే కారణం. ఎందుకంటే టీడీపీలో ఎవరితో అయితే విభేదించి శిల్పా బ్రదర్స్ బయటకి వెళ్లిపోయారో వాళ్లు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్టు కర్నూలు మాట్లాడుకుంటోంది.

అందుకే మళ్లీ టీడీపీ తలపు తట్టాలని పట్టుదలతో ఉన్నట్టు చెబుతున్నారు. నిజానికి టీడీపీలోంచి సిట్టింగులు వెళ్లిపోయారే అనుకున్నా కానీ ఖాళీ లేదు. అక్కడ టీజీ తనయుడితోపాటు ఎస్పీవై రెడ్డి కుటుంబం నుంచి బిజ్జం ఫ్యామిలీ నుంచి పోటీ గట్టిగా ఉంది. అందుకే మరి చంద్రబాబు వాళ్లని మళ్లీ ఎంత వరకూ రానిస్తాడో అనేది చూడాలి. మొత్తానికి జగన్ అయితే చేయి కాల్చినోడు మూతి కూడా కాల్చాడన్నట్టు చేశాడు శిల్పా బ్రదర్స్ ని !

-->