టీడీపీ లీడర్ వాదనతో కాంగ్రెస్ అధిష్టానం షాక్ ! అమాంతం ఆయన రేసులోకి వచ్చాడు !

చిన్నాచితక పార్టీ అని ముద్ర వేయాలని చూడకండి – పొత్తులో మేం గెలిచిన సీట్లు 20. రెండో స్థానంలో నిలిచిన సీట్లు మరో 25. మీరు గెలిచినవి కాకుండా మరో 31 చోట్ల రెండో స్థానంలో ఉన్నారు. అలాంటప్పుడు మీకు 65 రావాలి. మాకు 45 ఉండాలి. అంతే కానీ ఈ బేరాలేంటి ? అంటూ టీడీపీ లీడర్ లెక్కలు ముందేశాడు. ఏం మాట్లాడాలో తెలియక నోరెళ్ల బెట్టింది కాంగ్రెస్ హైకమాండ్ !

మహా కూటమి చర్చల్లో మలుపులు, మడతలు చాలా ఉన్నట్టు కనిపిస్తున్నాయ్ అంటూ టాక్ నడుస్తున్న సమయంలో జరిగిన సీన్ ఇది. ఎప్పుడూ మీరు చెప్పాలనుకోవడం, ఎదుటివాళ్లు వినాలనుకోవడం కాదు. కేంద్రంలో కాంగ్రెస్ రావాలన్న కోరిక చంద్రబాబుది. అందుకే సహకరించమని చెప్పారు. సీట్ల విషయంలో మేమేమీ పట్టుకొని కూర్చోలేదు. అలాగని మా వ్యూహాన్ని మీరు అలుసుగా తీసుకుంటే నష్టం ఎవరికి ? తెలుసుగా అంటూ దులిపేశాడు. ఎప్పుడూ ఆయన పెద్దగా మట్లాడ్డు. రాజకీయం తెలిసినట్టుగా కూడా ఉండడు. పై పెచ్చు ఈ మధ్య బాగా దెబ్బతిని పోయాడు అన్ని రకాలుగా ‍! ఆ సింపథీ క్లోజ్డ్ సర్కిల్స్ లో ఉందనుకోండి. ఇప్పుడు సీట్ల పంచాయతీలో ఆయన మాట్లాడిన తీరు చూశాక, ప్రాధాన్యం పెంచాలన్న డిమాండ్లు వస్తున్నాయ్. ఈ వాదన చూశాకే కాంగ్రెస్ ఆలోచనలో పడినట్టు చెబుతున్నారు. సీట్ల సంఖ్య కూడా పెరగబోతోంది అంటున్నారు. ప్రతీ సీటూ అడ్డం కొడతారా ? మాకు నాయకుడు ఉన్నాడు అక్కడ అంటారా ? ఏం మాకు లేరా ? మేం 60 శాతం సీట్లు వదులుకున్నాం. అవకాశం ఉన్న నేతల్ని కూడా బుజ్జగించాం. మరి మీరు ఏం చేశారు ? మా మీదకి ఉసిగొల్పి ఇలా చేస్తారా ? ఇలా అయితే అందరికీ నష్టం. కాస్త ఆలోచించండి. మేం చంద్రబాబుకి కూడా ఇదే మాట చెబుతాం అంటూ మాట్లాడేసరికి కాంగ్రెస్ ఇప్పుడు లెక్కలు మళ్లీ కట్టడం మొదలైంది.

ఎంత కట్టినా ఏం చేసినా జరగాల్సింది అంతా ఈ రెండు మూడు రోజుల్లోనే జరగాలి. ఏ పార్టీకి ఏ సీటో తేలాలి. ఆ తర్వాత టీడీపీలో ఎవరు బరిలో దిగుతారో ఎవరికి అవకాశమో లెక్కేసుకోవాలి. టీడీపీకి 16 సీట్లు వచ్చినా గెలుపు శాతం కచ్చితంగా 90 శాతం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయ్. అందుకే ఇప్పుడు ఇంత ధాటిగ ఘాటుగా వెళ్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు అంటారా ? ఆశ్చర్యపోకండి సుమా ! నామా ! ఇదంతా ఖమ్మం కాన్ఫిడెన్స్ కావొచ్చు !

-->