టీడీపీలోకి రావాల్సినోడు వైసీపీలోకేనా ? ఆ రాజు గారికి కేసీఆర్ కాలు అడ్డు పెట్టేశాడా ?

గోల్ కీపర్ నేనే – గోల గోల చేస్తా అంటున్నాడు కేసీఆర్ ! టీడీపీలో నుంచి లాగడమే కాదు, టీడీపీలోకి రావాల్సిన వాళ్లని కూడా ఆపుతా అంటున్నాడు. ఆల్రెడీ ఆ రాజు గారిని ఆపేశాడు అనే ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఎలా ఆపే ప్రయత్నం చేశాడో తెలుసా ?

కేసీఆర్ ఏపీ రాజకీయాల కోసం ఓ బృందాన్ని సిద్ధం చేశాడు. కులాల వారీగా, వ్యాపారాల వారీగా అవి పనిచేస్తున్నాయ్. ఇప్పుడు రాజుల కోసం యాక్షన్ టీమ్ దిగింది. వాళ్లు ప్రత్యేకంగా కేసీఆర్ తరపున రాజబారాలు చేస్తున్నారట. అన్నా, మనం కేసీఆర్ తో ఉన్నాం అక్కడ. కేసీఆర్ ఇక్కడ జగన్ తో ఉన్నాడు. అందుకని మనం వైసీపీ వైపు మాత్రమే చూడాలి. మరో దారి లేదు అని చెప్పి ఒత్తిడి తెచ్చి – బుజ్జగించి రాజకీయం చేశారు. ఆయనేమో మానసికంగా సిద్ధం అయిపోయాడు. నా కూతురికి కూడా చెప్పేశాను అన్నాడు. అది ఆయన ఊతపదం లెండి. నిజానికి ఆయన టీడీపీలోకి రావడం ఖాయం అని కొన్ని నెలలుగా ప్రచారం సాగుతోంది. షెడ్యూల్ వచ్చాక నేను చెబుతాను. ఏదో పార్టీలో అయితే చేరాలి కదా, చంద్రబాబు నాయుడు అయితే బాగానే చేస్తున్నాడు. అలాగని వారిని పూర్తిగా సమర్థిస్తున్నట్టు కాదు అంటూ ఆయన పరోక్షంగా హింట్లు ఇస్తున్నారు కొన్నాళ్లుగా. ఇప్పుడు అలాంటి రాజు గారిపై ఒత్తిడి తెచ్చేసరికి మెత్తబడ్డాడు అంటున్నారు. ఇదే అదునుగా అటు వైసీపీ కాలర్ ఎగరేస్తోంది. మేం మా బ్యాటు వాడకుండానే కేసీఅర్ మా ఖాతాల్లో రన్స్ జమ చేస్తాడు. చూశారా అన్నట్టుగా చెబుతోంది కబుర్లు ఆ పార్టీ !

అయితే రాజులొచ్చి చేరమంటే చేరిపోతాడా అంటే డౌటే. ఎందుకంటే పార్టీలో అయితే చేర్చగలరు కానీ గెలిపించలేరు కదా ! ఆ విషయం ఆయనకి బాగా తెలుసు. పైగా ఉత్తరాంధ్రలో ఉనికి కూడా పెద్దగా లేదు. అందుకే ఆయన నిర్ణయం తీసుకుంటాడు అని టీడీపీ నమ్ముతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి !

-->